అంతర్జాతీయం

కాశ్మీర్‌ను ఖాళీచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 25: దాయాది పాకిస్తాన్ మరోసారి భారత్‌పై నోరు పారేసుకుంది. భారత్ అక్రమంగా కాశ్మీర్‌ను ఆక్రమించిందని నిందారోపణలకు దిగింది. అంతటితో ఆగకుండా భారత్ తన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వెంటనే కాశ్మీర్‌ను ఖాళీ చేయాలని పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ డిమాండ్ చేశారు. దీర్ఘకాలికంగా కొనసాగుతున్న కాశ్మీర్ వివాదం పరిష్కారంలో ఇంకెంత మాత్రం జాప్యం జరిగినా, అది ప్రాంతీయ శాంతికి విఘాతం కలిగిస్తుందని ఆయన హెచ్చరించారు. మొహమ్మద్ అలీ జిన్నా జయంతిని పురస్కరించుకొని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె) రాజధాని ముజఫరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారత్‌ను హెచ్చరించారు. కాశ్మీర్ ప్రజల మనోభావాలను భారత్ గౌరవించాలని ఆయన అన్నట్టు ‘డాన్’ దినపత్రిక పేర్కొంది. కాశ్మీర్‌ను ఆక్రమించిన భారత సైనిక బలగాలు కాశ్మీర్ ప్రజలను అణచివేయడానికి ప్రతి క్రూరమైన వ్యూహాన్ని అనుసరిస్తున్నాయని హుస్సేన్ ఆరోపించారు. ఇందులో భాగంగా వన్య మృగాలను వేటాడేందుకు ఉపయోగించే పెల్లెట్ గన్‌లను అమాయకులయిన, నిరాయుధులయిన కాశ్మీర్ ప్రజలపై విచక్షణారహితంగా ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. కాశ్మీర్ ప్రజలు తమ స్వయం నిర్ణయాధికార హక్కును వినియోగించుకునేందుకు సహకరించాలని ఆయన అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు.