అంతర్జాతీయం

అమెరికాలో మితిమీరిన ఇమిగ్రేషన్ వేధింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 25: అమెరికా ఇమిగ్రేషన్ అధికారుల వేధింపులకు గురయిన వారి జాబితా రోజురోజుకు పెరిగిపోతోంది. తాజాగా బాక్సింగ్ లెజండ్ మహమ్మద్ అలీ కుమారుడు కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. జమైకానుంచి తిరిగి వస్తుండగా ఫ్లోరిడా విమానాశ్రయంలో దాదాపు రెండు గంటలపాటు ఆపేశారు. ఈ సందర్భంగా ఆయన ఏ మతానికి చెందినవాడని అధికారులు రెండుసార్లు గుచ్చి గుచ్చి ప్రశ్నించినట్లు జూనియర్ మహమ్మద్ అలీ స్నేహితుడు, లాయరు అయిన క్రిస్ మాన్సిని ‘లూయిస్ విల్లే కొరియర్’ పత్రికకు చెప్పారు. ఈ నెల 7న 44 ఏళ్ల మహమ్మద్ అలీ జూనియర్ తన తల్లి ఖలీలా కామచో-అలీతో కలిసి వస్తుండగా ఫోర్ట్‌లాడెర్‌డేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు పక్కకు లాగేశారు. వీరి పేర్లలో అరబిక్ పదాలు ఉండడమే దీనికి కారణం. అయితే కామచో తాను తన మాజీ భర్తతో కలిసి ఉన్న ఫోటోను చూపించిన తర్వాత అమెరికా కస్టమ్స్ అధికారులు ఆమెను వదిలిపెట్టేశారు. అయితే జూనియర్ వద్ద అలాంటి ఫోటో ఏదీ లేకపోవడంతో దాదాపు రెండు గంటలపాటు అధికారులు ఆయనను ప్రశ్నలతో ఊపిరి తీసుకోనివ్వలేదు. ‘మీరు ముస్లిమా.. మీకు ఆ పేరు ఎలా వచ్చింది’ అంటూ ప్రశ్నించగా, మహమ్మద్ అలీ జూనియర్ అవునని సమాధానం చెప్పినట్లు మాన్సినీ చెప్పారు. ఆ తర్వాత జూనియర్ చెప్పిన సమాధానాలకు సంతృప్తి చెందిన అధికారులు ఆయనను వదిలిపెట్టారు.
కాగా, దీనిపై అలీ కుటుంబం న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశముందని మాన్సినీ చెప్పారు. ఇలా ప్రశ్నించడానికి ఎంతమందిని ఆపేశారో తెలుసుకోవడానికి అలీ కుటుంబం ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించి పత్రిక అడిగిన ప్రశ్నలకు ఎయిర్‌పోర్ట్, కస్టమ్స్ అధికారులు ఎలాంటి సమాధానాలు చెప్పలేదు. ‘దీనికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే బాధ్యుడు. ఆయన ముస్లింలను అమెరికానుంచి నిషేధించడంవల్లనే ఈ పరిస్థితి వచ్చింది’ అని మహమ్మద్ అలీ కుటుంబం అంటోంది.