అంతర్జాతీయం

పత్రికలపై ట్రంప్ అక్కసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 25: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇన్నాళ్లూ తనకు వ్యతిరేకంగా వార్తలు రాసే పత్రికలపై కేవలం ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, ఇప్పుడు నేరుగా చర్యలకు దిగారు. శుక్రవారం వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశానికి న్యూయార్క్ టైమ్స్, సిఎన్‌ఎన్, బిబిసిలాంటి పలు ప్రముఖ వార్తసంస్థల ప్రతినిధులను ఆహ్వానించలేదు. పత్రికల్లో అధికభాగం అమెరికా ప్రజలకు వ్యతిరేకమని ట్రంప్ కన్సర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ వార్షిక సమావేశంలో ట్రంప్ విమర్శించిన కొద్ది గంటలకే ఈ సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ కార్యాలయంలో జరిగిన ఈ విలేఖరుల సమావేశానికి ఆహ్వానాలు పంపని వాటిలో న్యూయార్క్ టైమ్స్, లాస్ ఏంజిల్స్ టైమ్స్, పొలిటికో, బజ్‌ఫీడ్, బిబిసి, గార్డియన్‌లాంటి ప్రముఖ వార్తాసంస్థలున్నాయి. వైట్‌హౌస్ బ్రీఫింగ్ రూమ్‌లో ప్రతిరోజూ ఆన్ కెమెరా బ్రీఫింగ్ ఉంటుండగా నిన్న మాత్రం ఆఫ్-కెమెరా బ్రీఫింగ్ నిర్వహించారు. ఈ వార్తాసంస్థలకు చెందిన రిపోర్టర్లు స్పైసర్ కార్యాలయంలోకి రావడానికి ప్రయత్నించగా, ఆహ్వానితుల జాబితాలో వారు లేనందున లోపలికి రావడానికి వీల్లేదని అక్కడున్న సిబ్బంది వారికి స్పష్టంగా చెప్పారు. కాగా, ప్రతిరోజూ ఆన్ కెమెరా సమావేశాలు జరపాల్సిన అవసరం లేదని కొన్ని ఆఫ్ కెమెరా సమావేశాలు కూడా జరుగుతుంటాయని స్పైసర్ వివరణ ఇచ్చారు.
తప్పుడు మీడియాకే వ్యతిరేకం: ట్రంప్
వాషింగ్టన్‌లో జరిగిన కన్సర్వేటివ్‌ల రాజ్యాంగ కార్యాచరణ సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ తాను తప్పుడు వార్తల మీడియాకే వ్యతిరేకమని, పత్రికా స్వేచ్ఛకు వ్యతిరేకం కాదని అన్నారు. విశ్వసనీయ కథనాల పేరుతో తప్పుడు వార్తలు రాసే పత్రికలనే తాను వ్యతిరేకిస్తున్నానన్నారు. మీడియా వాస్తవాలను చెప్పకపోవడం దేశానికే ప్రమాదకరమని అన్నారు. తప్పుడు కథనాలను ఎత్తి చూపించినప్పుడల్లా వాటిని రాసే మీడియా పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ అంటూ అమెరికా రాజ్యాంగానికి చేసిన తొలి సవరణను ఎత్తి చూపిస్తాయని, నిజానికి ఆ సవరణ అంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు. కాగా, వైట్‌హౌస్ మీడియా సమావేశాలకు కొన్ని వార్తాసంస్థల ప్రతినిధులను అనుమతించకపోవడంపై పలువురు వైట్‌హౌస్ జర్నలిస్టులు, మీడియా సంస్థలు తీవ్రంగా స్పందిస్తూ ప్రజాస్వామిక విలువలకు తీరని అవమానంగా అభివర్ణించాయి.