అంతర్జాతీయం

కాన్సాస్ కాల్పుల ఘటనకు ఖండన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఫిబ్రవరి 25: అమెరికాలో శే్వతజాతీయుడి దురహంకారానికి తెలుగు యువ ఇంజనీర్ కూచిభొట్ల శ్రీనివాస్ బలైపోయిన ఘటనపై పలువురు ప్రముఖులు తీవ్రస్థాయిలో స్పందించారు. మతిలేని హింసకు, అసహనం వలన తలెత్తే విభేదాలకు, విద్వేషానికి సమాజంలో తావులేదని ‘మైక్రోసాఫ్ట్’ సిఇవో సత్య నాదెళ్ల స్పష్టం చేశారు. శ్రీనివాస్ హత్యను ఐక్యరాజ్య సమతి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటనను పలువురు అమెరికా పార్లమెంట్ సభ్యులు బహిరంగంగా ఖండించారు. మతిలేని ఇటువంటి హింసాత్మక చేష్టలకు దేశంలో తావు కల్పించరాదని, విద్వేషానికి మనం విజయాన్ని చేకూర్చరాదని ఇండో-అమెరికన్ సెనేటర్లు కమలా హారిస్ , ప్రమీలా జయపాల్, రో ఖన్నా, కాలిఫోర్నియాకు చెందిన పార్లమెంట్ సభ్యుడు బ్రాడ్ షెర్మన్ పేర్కొన్నారు.

చిత్రం..కాల్పులు జరిగిన కాన్సాస్‌లోని బార్ వద్ద దర్యాప్తు చేస్తున్న ఎఫ్‌బిఐ అధికారులు