అంతర్జాతీయం

ఉద్యోగాలకు గండికొట్టే నిబంధనలపై టాస్క్ఫోర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 25: కొత్త ఉద్యోగాల కల్పనకు అడ్డంకిగా ఉండే నిబంధనలను తొలగించడానికి ఒక టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని తన ప్రభుత్వాన్ని ఆదేశించే ఒక ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు హాని చేసేవి, తద్వారా కొత్త ఉద్యోగాలు, వ్యాపార సంస్థల సృష్టికి హానికరంగా ఉండే నిబంధనలను లోతుగా పరిశీలించే అంకితభావం కలిగిన వారితో ఒక రెగ్యులేటరీ సంస్కరణల టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ఈ ఎగ్జిక్యూటివ్ ప్రతి ఏజన్సీని ఆదేశిస్తోందని ట్రంప్ తెలిపారు. ఇప్పుడున్న నిబంధనలు దేశంలో వ్యాపారం చేయడాన్ని కఠినతరం చేస్తున్నాయని, వీలయినంత త్వరగా ఈ సమస్యను పరిష్కరిస్తామని కంపెనీలకు హామీ ఇచ్చారు. ప్రతి కొత్త నిబంధనకు రెండు పాత నిబంధనలు రద్దు కావాలని పేర్కొనే ఉత్తర్వుపైన కూడా సంతకం చేశారు.