అంతర్జాతీయం

ఆస్కార్ విగ్రహం విలువ పది డాలర్లే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఏంజిలిస్, ఫిబ్రవరి 25: వినోద ప్రపంచంలో ఆస్కార్ పురస్కారానికి ఉన్న ప్రతిష్ఠ అంతా ఇంతా కాదు. ఈ పురస్కారం లభిస్తే ఎవరైనా తమ జన్మధన్యమయిందని భావిస్తుంటారు. అయితే, అంతటి ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ విగ్రహం విలువ మాత్రం కేవలం పది డాలర్లేనని ఎంటర్‌టైన్‌మెంట్ వీక్లీ పేర్కొంది.
ఆస్కార్ విగ్రహం తయారు చేయడానికి అయ్యే వ్యయం 400 డాలర్లు. అయితే నిబంధనల (రూల్) ప్రకారం, ఈ ట్రోఫీని వేలానికి పెట్టడానికి ముందు అకాడమి ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైనె్సస్‌కు కేవలం పది డాలర్లకే ఆఫర్ చేయడం తప్పనిసరని తెలిపింది. ఈ రూల్‌ను సమర్థిస్తున్న వారిలో ఒకరయిన ఆస్కార్ పురస్కార గ్రహీత స్టీవెన్ స్పీల్‌బర్గ్.. బెట్ డేవిస్, క్లార్క్ గేబుల్‌కు చెందిన ఆస్కార్‌లపై 1.36 మిలియన్ డాలర్లు వ్యయం చేశారు. వీటిని తిరిగి అకాడమీకి విరాళంగా ఇవ్వడానికే ఆయన అంత వ్యయం చేశారు. 2015లో ఒక కోర్టు కూడా ఈ రూల్‌ను సమర్థించింది.