అంతర్జాతీయం

విజేత లా లా ల్యాండ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఫిబ్రవరి 26: అంతర్జాతీయ సినిమా పండుగ ఆస్కార్ మరికొన్ని క్షణాల్లోనే మన కళ్ల ముందు సాక్షాత్కరించబోతోంది. 89వ పురస్కారాల వేడుకల్లో మొత్తం 24 కేటగిరీలలో ఈ సమున్నత పురస్కారాలను అందుకునేందుకు మేటి చిత్రాలు, దర్శకులు, కళాకారులు పోటాపోటీగా సిద్ధమవుతున్నారు. ఈ సారి కచ్చితంగా అత్యధిక సంఖ్యలో ఆస్కార్ పురస్కారాలు 14 నామినేషన్లు దక్కించుకున్న లా లా ల్యాండ్‌కు దక్కే అవకాశం కన్పిస్తున్నది.
ఎక్కువ పురస్కారాలను అందుకునేందుకు ఈ చిత్రం పోటీ పడుతోంది. ఒక వేళ లా లా ల్యాండ్‌కు ఈ అవార్డు దక్కకపోతే అది సంచలనమేనన్న వాదనా వినిపిస్తోంది.
ఈ ఏడాది మొత్తం 62 సినిమాలు ఆస్కార్‌కు నామినేట్ అయ్యాయి. ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రం వంటి వాటి కోసం ఈసారి గట్టిగానే పోటీ జరిగే అవకాశం కన్పిస్తోంది.