అంతర్జాతీయం

రుణ ఎగవేతదారులూ లండన్‌లో నివసించొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఫిబ్రవరి 26: రుణ ఎగవేతదారులు కూడా లండన్‌లో నివసించేంత ఉదారంగా బ్రిటన్ ప్రజాస్వామ్యం ఉందని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. దీనివల్ల మామాలు అవసరాలకు కూడా విఘాతం కలుగుతోందని పేర్కొన్నారు. భారత్‌లో రుణాల ఎగవేత, ఇతర కేసుల్లో నిందితుడయిన లిక్కర్ బారన్ విజయ్ మాల్యా లండన్‌లో నివసిస్తుండటాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రుణ ఎగవేతదారులు చట్టం నుంచి తప్పించుకొని పారిపోవడాన్ని భారత్ ఎంతోకాలం భరించజాలదని ఆయన పేర్కొన్నారు. ‘బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటే తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని, లండన్‌కు వచ్చి నివసిస్తే సరిపోతుందని చాలా మంది అనుకుంటున్నారు. రుణ ఎగవేతదారులు ఇక్కడ నివసించేందుకు వీలు కల్పించేంత సరళీకృతంగా బ్రిటన్ ప్రజాస్వామ్యం ఉంది’ అని జైట్లీ అన్నారు. ద లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ (ఎల్‌ఎస్‌ఇ)కు చెందిన దక్షిణాసియా కేంద్రం శనివారం ఇక్కడ ‘ట్రాన్స్‌ఫామింగ్ ఇండియా: విజన్ ఫర్ ద నెక్స్ట్ డికేడ్’ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. రుణ ఎగవేతదారులు పారిపోవడం ఇంతకుముందెప్పుడూ జరగలేదని ఆయన పేర్కొన్నారు. ఎగవేతదారులు పారిపోతే, భారత్‌లోని వారి ఆస్తులను జప్తు చేయడం జరిగిందన్నారు.