అంతర్జాతీయం

వైట్‌హౌస్ ఉద్యోగానికి ముస్లిం మహిళ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 26: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి చివరికి వైట్‌హౌస్‌లో పని చేసే ఉద్యోగులకు సైతం నచ్చని పరిస్థితి వచ్చింది. ఏడు ముస్లిం దేశాలకు చెందిన వారిపై ట్రంప్ నిషేధం విధించిన కారణంగా తాను ఉద్యోగంనుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు వైట్‌హౌస్‌లో పని చేస్తున్న రుమానా అహ్మద్ అనే ముస్లిం మహిళ తెలిపింది. బంగ్లాదేశ్ మూలాలున్న రుమానాను 2011లో వైట్‌హౌస్‌లో నేషనల్ సెక్యూరిటీ విభాగంలో పని చేయడం కోసం ఎంపిక చేశారు. ఈ విభాగంలో పని చేసే వారిలో తానొక్కదానే్న హిజాబి (మేలిముసుగు) ధరించే మహిళనని, ఒబామా హయాంలో ఉద్యోగులంతా తోటి ఉద్యోగుంతా తనను కలుపుకొని పోయి పని చేశారని, అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటినుంచి అందరూ తనను అనుమానంగా చూసేవారని ‘ది అట్లాంటిక్’ పత్రికలో రాసిన ఓ వ్యాసంలో ఆమె తెలిపింది.ముస్లిం దేశాలకు చెందిన వారిపై ట్రంప్ నిషేధం విధించిన తర్వాత తనను, తనలాంటి అమెరికన్ ముస్లింలను అవమానకరంగా చూసే చోట ఎంతో కాలం పని చేయలేనని తాను అనుకుంటూనే ఉన్నానని, అయినప్పటికీ నిషేధపు ఉత్తర్వులు జారీ అయ్యాక కూడా ఎనిమిది రోజులు పని చేశానని ఆమె చెప్పారు. చివరి రోజు సాయంత్రం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కమ్యూనికేషన్స్ సీనియర్ అడ్వైజర్ మైకేల్ ఆంటన్‌కు తన నిర్ణయాన్ని చెప్పినప్పుడు ఏకంగా ప్రభుత్వంనుంచే వైదొలగుతున్నావా అని అడిగారే తప్పితే ఎందుకు అని అడగలేదని ఆమె అన్నారు. అయితే చాలా అవమాన భారంతో నా దేశపు చారిత్రక భవనంనుంచి నిష్క్రమిస్తున్నట్లు, ఒక అమెరికన్‌గా, ఒక ముస్లింగానే ఉంటానని తాను ఆయనకు చెప్పానని రుమానా ఆ వ్యాసంలో పేర్కొన్నారు. జార్జి వాషింగ్టన్ యూనివర్శిటీనుంచి గ్రాడ్యుయేషన్ చేశాక అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా స్ఫూర్తితో తాను వైట్‌హౌస్‌లో చేరానని, అయితే ట్రంప్ వచ్చాక వైట్‌హౌస్‌లో వాతావరణం పూర్తిగా మారిపోయిందని ఆమె ఆ వ్యాసంలో తెలిపింది.