అంతర్జాతీయం

మనం ఒకటి కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: అమెరికాలో నివసిస్తున్న ప్రతి భారతీయుడూ సురక్షితంగా ఉండాలంటే భారతీయ అమెరికన్లంతా ఐక్యం కావాలని ప్రముఖ అమెరికన్ సిక్కు నాయకుడు గురిందర్ సింగ్ ఖల్సా పిలుపునిచ్చారు. భారతీయ ఇంజనీర్ కూచిభొట్ల శ్రీనివాస్ విషాద మృతి పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ‘‘మన మొట్ట మొదటి ప్రాధాన్యం అమెరికాలో నివసిస్తున్న ప్రతి భారతీయుడు, సిక్కులు భద్రంగా, సురక్షితంగా ఉండేలా చూడటం’’ అని ఆయన అన్నారు. అమెరికాలో భారత్ నుంచి వచ్చిన సిక్కుల రాజకీయ కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసిన ఖల్సా తాజాగా అమెరికా వ్యాప్తంగా భారతీయ సమాజాన్ని ఏకత్రితం చేసి భారతీయ సంతతి వారిపై విద్వేష పూరిత నేరాలు జరగకుండా ఫెడరల్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని ప్రకటించారు. కొత్త ప్రభుత్వం ప్రకటించిన ఇమ్మిగ్రేషన్ నియమాలు సంక్లిష్టంగా ఉన్నాయన్నారు. గతంలో దోషిగా నిర్ధారణ అయిన వాళ్లను దేశం నుంచి బయటకు పంపించేవారని, ఇప్పుడు నేరారోపణ జరిగినప్పుడే ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఖల్సా పేర్కొన్నారు. ‘‘నిజం చెప్పాలంటే ఇంత వేగంగా మార్పులు జరుగుతున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. వీటిపైన వివరణ కోసం ప్రభుత్వంతో అలుపెరుగకుండా అధికారులతో మంతనాలు చేస్తున్నాం. తొందర్లోనే అన్నింటికీ సమధానాలు దొరుకుతాయని భావిస్తున్నాం’’ అని ఆయన అన్నారు. భారతీయులు, భారతీయ అమెరికన్లు అమెరికా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేశారని ఆయన అన్నారు. కాన్సాస్‌లో కూచిభొట్ల శ్రీనివాస్ విద్వేష కాల్పులకు బలికావటం మరోసారి అమెరికాలోని జాతి వివక్షకు దర్పణం పట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై అమెరికాలోని భారతీయులంతా ఏకమై ఇలాంటి హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఎలాంటి కార్యాచరణను పాటించాలో నిర్ణయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అమెరికాలో భారతీయులు, సిక్కులు రాజకీయంగా క్రియాశీలంగా మారాల్సిన తరుణం ఆసన్నమైందని ఆయన అన్నారు.