అంతర్జాతీయం

మరో ఉత్తర్వు సిద్ధం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 27: ఏడు ముస్లిం దేశాలకు చెందిన పౌరులు, అక్రమ వలసదారుల్ని నిరోధించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ఉత్తర్వును సిద్ధం చేస్తున్నారు. తొలి కార్యనిర్వాహక ఆదేశం వివాదాస్పదం కావడం, కోర్టుల జోక్యంతో అది ఆగిపోవడంతో ఈ సారి ఎలాంటి చట్టపరమైన సమస్యలకు తావు లేని రీతిలోనే తాజా ఉత్తర్వుపై బుధవారమే ట్రంప్ సంతకం చేసే అవకాశం ఉంది. అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల ప్రతినిధుల్ని ఉద్దేశించి ట్రంప్ మంగళవారం మాట్లాడుతున్నారు. అనంతరమే ఈ కొత్త ఉత్తర్వుపై సంతకం చేస్తారని సీనియర్ అధికారి తెలిపారు. నిజానికి గతవారమే ఈ ఉత్తర్వు జారీ కావాల్సి ఉన్నప్పటికీ చట్టపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలూ తీసుకునేందుకే అది వాయిదా పడిందని వైట్‌హౌజ్ ప్రతినిధి సీన్ స్పైసర్ తెలిపారు. ఎలాంటి తప్పిదాలు, పొరపాట్లకు తావు లేని రీతిలోనే కొత్త ఉత్తర్వు రూపకల్పన జరగాలన్నదే ట్రంప్ ఆశయమని, అందుకే కొత్త ఆదేశం జారీలో జాప్యం జరిగిందని వివరించారు. అయితే కొత్త ఉత్తర్వులో మొదటి ఉత్తర్వులోని అంశాలే దాదాపుగా ఉంటాయని, కొన్ని సాంకేతిక మార్పులు మాత్రమే జరిగాయని తెలుస్తోంది. ట్రంప్ తన మొదటి ఉత్తర్వులో 120 రోజుల పాటు అమెరికా శరణార్ధ కార్యక్రమాన్ని నిలిపివేశారు. సిరియాకు చెందిన శరణార్ధులపై శాశ్వతంగా నిషేధం విధించారు. ముస్లిం మెజార్టీ కలిగిన ఇరాక్, సిరియా, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమన్‌లకు చెందిన ముస్లిం శరణార్ధుల రాకపై తాత్కాలిక నిషేధం విధించారు. ఆ ఉత్తర్వు వివాదాస్పదం కావడం, దేశ వ్యాప్తంగా ఉద్యమాలూ జరగడంతో కోర్టులు దాని అమలును నిలిపివేశాయి. దాంతో కొన్ని సవరణలతో కొత్త ఆదేశాన్ని జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆదేశం కొత్తదే అయినా తొలి ఉత్తర్వులోని వౌలిక లక్ష్యాలే ఇందులో దాదాపుగా ఉంటాయని వైట్‌హౌస్ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ తెలిపారు.అయితే న్యాయస్థానాలు చేసిన సూచనలు, ఇచ్చిన సలహాల ప్రకారమే దీని రూపకల్పన ఉంటుందని వివరించారు.