అంతర్జాతీయం

భయం వద్దు.. మేమున్నాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హూస్టన్, ఫిబ్రవరి 27: అమెరికాలో జాత్యహంకారానికి బలయిన హైదరాబాద్ టెకీ శ్రీనివాస్ కూచిభొట్లకు ఆదివారం రాత్రి కన్సాస్ సిటీలో వందలాది మంది నివాళులు అర్పించారు. శాంతి, ఐకమత్యం కావాలనే నినాదాలతో కూడిన ప్లకార్డులను చేతబట్టుకొని వారు ప్రదర్శనలో పాల్గొన్నారు. అమెరికన్ నేవీకి చెందిన 51 ఏళ్ల ఆడం పురింటన్ తుపాకి గుళ్లకు బలయిన శ్రీనివాస్ చిత్రాలను, బ్యానర్లను చేతపట్టుకొని ప్రదర్శకులు ముందుకు సాగారు. ‘మాకు శాంతి కావాలి. మేము శాంతిని ప్రేమిస్తున్నాం. మా పిల్లలను వదలి మమ్మల్ని వెళ్లగొట్టకండి. సమాజంలో సమైక్యత భాగం. కలసి నిలబడదాం- విడిపోతే పడిపోతాం’ అంటూ నినదించారు. ప్రదర్శకుల్లో అనేకమంది చేతుల్లో కొవ్వొత్తులు పట్టుకున్నారు. ‘విద్వేష రాజకీయాలకు మేము మద్దతివ్వం’ అనే నినాదాలు రాసిన బ్యానర్లను ప్రదర్శించారు. పురింటన్ జరిపిన కాల్పుల్లో గాయపడిన శ్రీనివాస్ స్నేహితుడు అలోక్ మాడసాని, పురింటన్‌ను అడ్డుకోబోయి కాల్పుల్లో గాయపడిన అమెరికన్ ఇయాన్ గ్రిల్లట్ సోదరీమణులు కూడా శ్రీనివాస్‌కు నివాళులు అర్పించేందుకు నిర్వహించిన ఈ శాంతి ర్యాలీలో పాల్గొన్నారు. అలోక్ మాడసాని ఊతకర్ర సాయంతోనే ర్యాలీకి వచ్చారు. కన్సాస్ లెఫ్టినెంట్ గవర్నర్ జెఫ్ కోలియర్, అమెరికా కాంగ్రెస్ సభ్యుడు కెవిన్ యోడర్, ఓలాథ్ మేయర్ మైక్ కోప్‌ల్యాండ్, ఓలాథ్ పోలీస్ చీఫ్ స్టీవెన్ మెంకె, ఇతర ప్రభుత్వ అధికారులు శ్రీనివాస్‌కు నివాళులు అర్పించేందుకు నిర్వహించిన ప్రార్థన సమావేశంలో పాల్గొన్నారు. కన్సాస్ సిటీలోని ‘ద హిందూ టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్’లో వివిధ మతాలకు చెందిన పురోహితులు శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. హిందూ, క్రిస్టియన్, జెవిష్, ముస్లిం, సిక్కు మతాలకు చెందిన ప్రార్థనలతో ప్రారంభమయిన ఈ కార్యక్రమం ప్రజలు జాన్ లెన్నోన్‌కు చెందిన ‘ఇమాజిన్’ను పాడటంతో ముగిసింది. అంతకుముందు కార్యక్రమానికి తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి అలోక్ మాడసాని మాట్లాడుతూ శ్రీనివాస్‌తో తన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. శ్రీనివాస్ ఎంతో కరుణామయుడని, ఇతరులను ఎంతో ప్రేమించేవాడని ఆయన పేర్కొన్నారు. పొరపాటున కూడా విద్వేష వ్యాఖ్యలు చేసేవాడు కాదని, నిర్లక్ష్యంగా మాట్లాడేవాడు కాదని చెప్పారు.
ఇలాంటి సంఘటనలు మళ్లీ జరుగకుండా ఉండేందుకు సమాధానాలు వెతకడం వంటి అనేక కారణాల రీత్యా తాను ఇక్కడికి వచ్చానని లెఫ్టినెంట్ గవర్నర్ కోల్‌యెర్ అన్నారు. దుష్టశక్తులపై మనం పైచేయి సాధిస్తామని, ఈ చీకట్ల నుంచి వెలుగుల్లోకి వెళ్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఇలాంటి చెదురుమదురు చెడు సంఘటనలను అధిగమిస్తామని, ఒక పెద్ద, బలమైన కమ్యూనిటీగా జీవిస్తామని, ప్రపంచాన్ని మారుస్తామని ఆయన భారతీయ సంతతికి చెందిన ప్రజలకు భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది ముందుకొచ్చారు. ‘గోఫండ్‌మి’ ఒక మిలియన్ డాలర్ల విరాళాలను సేకరించింది. బాధితుల కుటుంబాల వైద్యం ఖర్చులకోసం వీటిని ఉపయోగిస్తారు.

చిత్రాలు..
అమెరికాలో జాత్యహంకారానికి బలయిన హైదరాబాద్ టెకీ శ్రీనివాస్ కూచిభొట్లకు
కాన్సాస్ సిటీవాసులు పెద్దఎత్తున నివాళి అర్పించారు. శాంతి, ఐకమత్యం కావాలనే
నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిర్వహిస్తున్న ర్యాలీ
* శాంతిర్యాలీలో పాల్గొన్న అలోక్ మాడసాని