అంతర్జాతీయం

భారత్‌కు వెళ్లిపోదామని అన్నా..తనే వద్దన్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 27: ‘‘ప్రవాస భారతీయుల పట్ల అమెరికాలో జాతి విద్వేషం గురించి ముందుగానే అనుమానించాం. నేను ఆయనతో చాలా సార్లు చెప్పాను.. మనం మన దేశానికి తిరిగి వెళ్లిపోవటం గురించి ఆలోచించమని అడిగా..కానీ ఆయన అందుకు తిరస్కరించాడు. ఈ దేశాన్ని అతను ప్రేమించాడు’’ జాతి విద్వేష నేరానికి బలయిపోయిన కూచిభొట్ల శ్రీనివాస్ భార్య దుమల సునయన ఆవేదన వ్యక్తం చేశారు. మంచివాళ్లకు ఎప్పుడూ మంచే జరుగుతుందని శ్రీనివాస్ అనేవాడని ఆమె అన్నారు. ప్రతిరోజూ వార్తా పత్రికల్లో ఇలాంటి కాల్పుల ఘటనలు జరిగిన వార్తలు చదివినప్పుడల్లా ఆందోళన చెందేవారమని, చివరకు తమ దాంపత్యానికీ ఇదే విధమైన ముగింపు లభించటం దురదృష్టమని పేర్కొన్నారు.
కాన్సాస్ సిటీలోని ఓ బార్‌లో శ్రీనివాస్‌పై కాల్పులు జరిపిన అమెరికన్ అతణ్ణి ముస్లిం అనుకున్నాడట. బార్‌లో ఈ దుర్ఘటనను ప్రత్యక్షంగా చూసిన వాళ్లు ఘటన జరిగిన తీరు చెప్తుంటేనే అమెరికన్ల నరనరానా జాతి విద్వేషం ఎంతగా వేళ్లూనుకుందో అర్థమవుతుంది. ఆడమ్ డబ్ల్యు ప్యురింటన్(51) అనే ఈ దుండగుడు ‘‘మీరు మా దేశం నుంచి వెళ్లిపొండి’’ అంటూ పెద్దగా అరిచాడని ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పారు. కూచిభొట్ల శ్రీనివాస్, అతని మిత్రుడు అలోక్‌పై కాల్పులు జరిపిన అనంతరం పక్కనే ఉన్న మరో బార్‌లోకి దర్జాగా వెళ్లిన ప్యురింటన్ అక్కడ ఉన్న వారితో తాను మధ్యప్రాచ్యానికి చెందిన ఇద్దరు ముస్లింలను కాల్చి వచ్చానని గర్వంగా చెప్పాడని ఎఫ్‌బిఐ బృందానికి వివరించారు. ఇదంతా గమనిస్తే కూచిభొట్లను హత్య చేసిన దుండగుడికి అతను ఎవరన్నదే పూర్తిగా తెలియదన్నది స్పష్టమైంది. కూచిభొట్లను అతను మధ్యప్రాచ్యానికి చెందిన ముస్లింగా భావించాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముస్లింల వలసలను నిషేధిస్తూ వేగంగా తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ప్రభావితమైనట్లు అతని మాటలు, చేతలు స్పష్టంగా తెలుస్తున్నాయి.
పదేళ్ల క్రితం అమెరికాకు ఇంజనీర్ అయ్యేందుకు వచ్చిన శ్రీనివాస్ సునయను ఆరేళ్లపాటు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2013లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు డల్లాస్ నుంచి 1500మైళ్లు రోడ్డు మీదుగా ప్రయాణం చేశారు. ఆయనకు ఏవియేషన్ అంటే కూడా చాలా ఇష్టమని సునయన చెప్పారు. ఈ పరిశ్రమలో విశేష కృషి చేయాలని కూడా అతను అనుకున్నాడని ఆమె అన్నారు. ఆయనకు ఇలాంటి చావు రావటం సరైంది కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాల్పుల ఘటనకు కొద్ది రోజుల ముందే శ్రీనివాస్, సునయన దంపతులు కన్సాస్‌లో శాశ్వతంగా ఉండిపోయేందుకు ఇల్లు కూడా కొనుక్కున్నారు. సంతానాన్ని కనేందుకు కూడా ప్లాన్ చేసుకున్నారు. అమెరికాలో ట్రంప్ కారణంగా వలసదారుల పట్ల ఒకరకమైన హిస్టీరియా మొదలైంది. వలస దారుల కుటుంబాల్లో ఒకరకమైన నిర్వేదం మొదలైంది. ఇప్పుడు ఎవరినోటా వినిపిస్తున్న మాట ఒకటే.. ‘మీ పిల్లల్ని అమెరికాకు పంపించవద్దని.’

భర్త శ్రీనివాస్‌తో సునయన (ఫైల్‌ఫొటో)