అంతర్జాతీయం

ఆస్కార్‌కు రాజకీయ రంగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఏంజెల్స్, ఫిబ్రవరి 27: ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఈ ఏడాది అందరూ ఊహించినట్టుగానే రాజకీయ రంగు పులుముకుంది. దేశంలోకి వలసలను నిషేధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ఇటీవల జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వులను ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించిన జిమీ కిమ్మెల్ సహా ప్రజెంటర్లు, పలువురు అవార్డు విజేతలు తమదైన శైలిలో ఎండగట్టారు.
అమెరికన్లతో పాటు మనల్ని అసహ్యించుకుంటున్న 225 పైగా దేశాల ప్రజలు టెలివిజన్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారని, ఇటువంటి పరిస్థితికి కారకుడైన ట్రంప్‌కు ‘్ధన్యవాదాలు’ తెలియజేస్తున్నానని కిమ్మెల్ విమర్శించారు. ఉత్తమ అలంకరణ, కేశాలంకరణ విభాగంలో అవార్డును కైవసం చేసుకున్న ఇటలీ చిత్రం ‘సూసైడ్ స్క్వాడ్’ బృంద సభ్యులు కూడా ట్రంప్‌పై నిప్పులు చెరిగారు. ‘నేనూ వలసదారుడినే. ఈ అవార్డును ఇతర వలసదారులకు అంకితమిస్తున్నా’ అని విజేతల్లో ఒకరు ప్రకటించడంతో ప్రేక్షకుల కరతాళ ధ్వనులు మిన్నంటాయి. ఆ తర్వాత ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ అవార్డును గెలుచుకున్న ‘ఓ.జె.మేడ్ ఇన్ అమెరికా’ చిత్ర నిర్మాత, దర్శకుడు ఎజ్రా ఎడెల్‌మన్ కూడా ఇదేవిధంగా వ్యవహరించారు.
పోలీసుల కర్కశత్వం, హింసాకాండ వలన బాధితులుగా మిగిలిన వారి తరఫున ఈ అవార్డు స్వీకరిస్తున్నానని ఆయన ప్రకటించారు. హత్యకు గురైన రోన్ గోల్డ్‌మన్, నికోల్ బ్రౌన్‌లను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, ఇది వారి కథతో తెరకెక్కించిన చిత్రమేనని స్పష్టం చేశారు. అలాగే అమెరికా సహా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో నిత్యం హింసాకాండకు బలవుతున్న వారికి ఉత్తమ సహాయ నటి అవార్డు విజేత వియోలా డావిస్ నివాళులర్పించారు. మరణించిన తర్వాత మనమంతా చేరేది శ్మశానానికే అని ఆమె స్పష్టం చేశారు.