అంతర్జాతీయం

సముద్రమార్గంలో ఉద్రిక్తతలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోర్ట్ మోరెస్బీ(పీఎన్జీ), ఏప్రిల్ 28: దక్షిణ సముద్రంపై చైనా ఆధిపత్య ధోరణి నేపథ్యంలో సముద్రమార్గంలో ఉద్రిక్తతలు, శత్రుత్వాలు కూడదని భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ గురువారం పిలుపునిచ్చారు. రెండు రోజుల అధికార పర్యటన కోసం పపువా న్యూ గినియా(పీఎన్‌జీ) కు ప్రణబ్ ముఖర్జీ స్థానిక పోస్ట్ కొరియర్ అన్న పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సముద్ర మార్గంలో ప్రయాణంపై కమ్యూనికేషన్స్ విషయంలో శత్రుత్వం, ఉద్రిక్తతలు ఉండరాదని ఆయన అన్నారు. పసిఫిక్ రీజియన్‌లో అతి పెద్ద ద్వీపమైన పీ ఎన్‌జీలో చైనా సైన్యం మోహరించి ఉన్న నేపథ్యంలో ఆ ద్వీప దేశంతో భారత్ రక్షణ సహకారంపై ప్రణబ్ ప్రసంగించటం విశేషం. ఈ ప్రాంతంలో మానవ అక్రమ రవాణా, స్మగ్లింగ్, డ్రగ్ ట్రాఫికింగ్ వంటి వాటి వల్ల ఆర్థికంగా, రాజకీయంగా అస్థిరత్వం ఏర్పడుతోందన్నారు. విపత్తు హెచ్చరికలకు సంబంధించి భారత ఉపగ్రహాల నుంచి వచ్చిన చిత్రాలను, సమాచారాన్ని పీ ఎన్జీతో పంచుకోవటానికి భారత్ సిద్ధంగా ఉందన్నారు. గురువారం ఉద యం ఈ ద్వీపానికి వచ్చిన భారత రాష్టప్రతికి 21తుపాకుల గౌరవ వందనాన్ని అక్కడి సైన్యం సమర్పించింది.

chitram పపువా న్యూ గినియాకు చేరుకున్న భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి
గురువారం స్వాగతం పలుకుతున్న అధికారులు