అంతర్జాతీయం

రోదసిలో గ్రహశకలాల సముదాయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఫిబ్రవరి 28: రోదసిలో మరో వినూత్న ఆవిష్కారం జరిగింది. స్టార్ వార్స్ సిరీస్ మాదిరిగా రెండు సూర్యుళ్ల చుట్టూ పరిభ్రమించే గ్రహ శకలాల సముదాయాన్ని యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్ శాస్తవ్రేత్తలు కనుగొన్నారు. స్టార్‌వార్స్ సిరీస్‌లో ల్యూక్ స్కైవాకర్ సొంత ప్రపంచంలో ఉన్నట్లుగా టాటూయిన్ మాదిరి రాతి గ్రహ వ్యవస్థను ఈ శాస్తవ్రేత్తలు కనుగొన్నారు. ఎస్‌డిఎస్‌ఎస్ 1557 అని పిలిచే ఈ వ్యవస్థలో తెలుపు, గోధుమ వర్ణాల్లోని రెండు సూర్యుడి తరహా నక్షత్రాల చుట్టూ చెదురుమదురుగా తిరిగే ఆస్టరాయిడ్ శకలాలు ఉన్నట్లు శాస్తవ్రేత్తలు తెలిపారు. ఈ పరిశోధన చాలా అద్భుతమైందని వారు పేర్కొన్నారు. ఇందులో ఉన్న గ్రహాలన్నీ గాలితో నిండిన పెద్ద పెద్ద గ్రహాలని, మన సౌర మండలంలో గురు గ్రహానికి దాదాపు సమాన పరిమాణంలో ఉన్నాయని పేర్కొన్నారు. వీటిలో భారీ పరిమాణంలో సిలికాన్, మెగ్నీషియం లోహాలు లభిస్తున్నాయన్నారు. దాదాపు 1.1 ట్రిలియన్ టన్నుల పదార్థం ఈ గ్రహాలపై లభిస్తుందని పేర్కొన్నారు. ఒక్కో ఆస్టరాయిడ్ నాలుగు కిలోమీటర్ల పరిమాణంలో ఉందన్నారు. ‘రెండు సూర్యుల చుట్టూ రాతి గ్రహాలు తిరగటం అంత సులభం కాదు. ఒకదానికొకటి పరస్పరం అతితీవ్రంగా తోసుకోవటం కానీ, ఆకర్షించటం కానీ చేస్తుంటాయి. డబుల్ స్టార్ సిస్టమ్‌లో పెద్ద పెద్ద ఆస్టరాయిడ్‌ల ద్వారా రాతి గ్రహాల ఏర్పాటు మమ్మల్ని ఆశ్చర్యపరచింది’ అని శాస్తవ్రేత్త ఫరిహి పేర్కొన్నారు.