అంతర్జాతీయం

ఎలిజిబెత్ రాణి నృత్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఫిబ్రవరి 28: బ్రిటన్ రాణి ఎలిజిబెత్‌కు భారతీయ నృత్యాలంటే ఎంత మక్కువో దీన్ని బట్టి తెలుస్తోంది. నృత్యంలో భాగంగా ప్రదర్శించే భంగిమలు ఆమెను ఎంతగానో ఆకట్టుకుంటాయని చెప్పడానికి భారత్-యూకె సాంస్కృతిక వార్షికోత్సవం ప్రారంభం సందర్భంగా జరిగిన సంఘటనే నిదర్శనం. ఈ ఉత్సవాల్లో భాగంగా ఎలిజిబెత్ బకింగ్ హం ప్యాలెస్‌లో ప్రత్యేక విందు ఇచ్చారు. ఆ విందులో భారత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ప్రముఖ నృత్యకారిణి అరుణిమా కుమార్ పాల్గొన్నారు. ‘ఏకం’ అనే ప్రత్యేక నృత్య రూపకాన్ని అరుణిమ ప్రదర్శించారు. ‘నాతోపాటు 90ఏళ్ల బ్రిటన్ రాణి కూడా నృత్యం చేయడం ఎంతో ఎంతగానో ఆకట్టుకుంది. నృత్య భంగిమలన్నీ సంక్లిష్టమైనవి కావడంవల్ల వాటని ఎలా చేయగలుగుతున్నారని కూడా నన్ను ఎంతో ఆసక్తిగా అడిగారు’ అని అరుణిమ తెలిపారు. భారత దేశం గురించి దీని సాంస్కృతిక ప్రత్యేకతల గురించి బ్రిటన్ రాణికి ఎంతో తెలుసునని, అన్ని విషయాలూ అడిగి తెలుసుకోవడం తనకు ఎంతో ఆనందం కలిగించిందని అరుణిమ అన్నారు. భారత కళలను సమష్టి కృషితో బకింగ్ హం ప్యాలెస్‌కు తీసుకెళ్లగలగడం ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు.

చిత్రం..బకింగ్‌హాం ప్యాలెస్‌లో నృత్య ప్రదదర్శన ఇస్తున్న భారతీయ కళాకారులు