అంతర్జాతీయం

ట్రంప్ వౌనం వీడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హూస్టన్, ఫిబ్రవరి 28: దేశంలో విద్వేష దాడులు పెరిగిపోతున్నాయంటూ అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ స్పష్టం చేశారు. ఇలాంటి విద్వేష కాల్పులకు బలైన కూచిభొట్ల శ్రీనివాస్ మృతి సంఘటనపై నోరువిప్పాలంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ సంఘటన తీవ్ర స్థాయిలో ఆందోళనలు రేకెత్తిస్తున్న నేపథ్యంలో ఇంకా వౌనం వహించడం ట్రంప్‌కు ఎంత మాత్రం సమంజసం కాదన్నారు. ఈ ఘటనపై ట్విటర్‌లో స్పందించిన హిల్లరీ ‘దేశాధ్యక్షుడిగా ‘పోటస్’ ( అమెరికా అధ్యక్షుడు) ఏమి చేయాలో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి సమయంలో ఆయన తన బాధ్యతను గుర్తించి వ్యవహరించాలి. ముందుకొచ్చి మాట్లాడాలి’అని స్పష్టం చేశారు. శ్రీనివాస్ హత్య, యూదు మతస్తులపై అమెరికాలో జరుగుతున్న దాడులను ఖండించాలన్నారు.
ఎవరి స్వేచ్ఛకూ భంగం కలుగదు
జాతి విద్వేష దాడికి సంబంధించి అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో ఎట్టకేలకు సోమవారం వైట్‌హౌస్ స్పందించింది. కాన్సస్ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, యూదు మతస్తులపై జరుగుతున్న దాడులను ఖండించింది. రోజువారీ మీడియా సమావేశంలో భాగంగా వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి సీన్ స్పైసర్ మాట్లాడుతూ ‘అమెరికాలో విద్వేష నేరాలను ఖండిస్తున్నాం. అలాంటి ఘటనలకు అమెరికాలో తావులేదు. అమెరికా కనుగొన్నప్పటి నుంచీ ఇక్కడ జీవిస్తున్న ప్రజల హక్కులు, స్వేచ్ఛ, మత సంప్రదాయాల రక్షణకు ప్రభుత్వాలు పనిచేస్తూనే ఉన్నాయి. పౌరులంతా వాళ్లవాళ్ల మత ధర్మాలను నిర్భయంగా అనుసరించొచ్చు. ఏ పౌరుడైనా ఏ మతధర్మాన్నైనా పాటించొచ్చు. ఆ ప్రాథమిక సూత్రానికి అమెరికా, అధ్యక్షుడు ట్రంప్ కట్టుబడే ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు. స్థానిక దర్యాప్తు సంస్థలతో కలిసి ఎఫ్‌బిఐ సైతం ఘటనపై దర్యాప్తు సాగిస్తోందని స్పైసర్ స్పష్టం చేశారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి సీన్ స్పైసర్