అంతర్జాతీయం

పురింటన్‌పై విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హ్యూస్టన్, ఫిబ్రవరి 28: కాన్సాస్ బార్‌లో కాల్పులు జరిపి భారతీయ ఇంజనీర్ కూచిభొట్ల శ్రీనివాస్ మృతికి కారకుడైన అమెరికా నేవీ మాజీ ఉద్యోగి ఆడమ్ పురింటన్ (51)ను న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. జాన్స్ కౌంటీ డిస్ట్రిక్ట్ జడ్జి నిందితుడిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు. ప్యూరింటన్ ఇద్దరు ఇండియన్ ఇంజనీర్లపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందారు. అలోక్ మేడసాని అనే మరో ఇంజనీర్ గాయపడ్డారు. పురింటన్‌ను అడ్డుకోబోయిన 24 ఏళ్ల అమెరికన్ ఇయాన్ గ్రిలోట్ కూడా గాయపడ్డ సంగతి తెలిసిందే. ఒలాథేలోని ఆస్టిన్ బార్ అండ్ గ్రిల్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. బార్‌లో ఇద్దరు భారతీయ ఇంజనీర్లతో వాగ్వివాదానికి దిగిన పురింటన్ ఉద్దేశపూర్వంగానే తుపాకీతో కాల్పులు జరిపాడు. మీరు ఏ దేశస్తులు అని అడిగి మరీ ‘ మా దేశం నుంచి వెళ్లిపోండి’ అంటూ తుపాకీ గుళ్లు కురిపించాడు. నిందితుడు పురింటన్‌పై రెండు కేసులను నమోదు చేశారు. అతడిపై నేరం రుజువైతే 50 ఏళ్ల వరకూ జైలుశిక్ష పడే అవకాశం ఉందని జాన్సన్ కౌంటీ డిస్ట్రిక్ట్ కోర్టు అటార్నీ స్టీవ్ హొవే స్పష్టం చేశారు. ఇండియన్-అమెరికన్లను తీవ్రంగా కలిచివేసిన కాల్పుల కేసు విచారణలో స్థానిక పోలీసులకు ఎఫ్‌బిఐ సహకారం అందిస్తోంది. వందలాది మంది భారతీయ విద్యార్థులు ఒలాథే ఘటనపై ఆందోళన చెందుతున్నారు. విద్వేషంతోనే పురింటన్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు రుజవైన పక్షంలో శిక్ష తీవ్రంగానే ఉంటుంది. నిందితుడు పురింటన్ ప్రస్తుతం జాన్సన్ కౌంటీ జైలులోనే ఉన్నాడు. ఇద్దరు ఇంజనీర్లపై కాల్పులు జరిపిన కొద్ది గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు.