అంతర్జాతీయం

అమెరికాలోమసీదులకు బెదిరింపు ఉత్తరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 2: అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం సిల్వర్ స్ప్రింగ్‌లో గల రెండు మసీదులకు విద్వేషంతో కూడిన రెండు బెదిరింపు ఉత్తరాలు వచ్చాయి. ఈ బెదిరింపు ఉత్తరాలలో ముస్లింలను వధించేవారికి నగదు బహుమతులను ప్రకటించారు. వీటికి బెదిరింపు ఉత్తరాలు పోస్టులో వచ్చాయి. కవర్‌లో పెట్టి వచ్చిన బెదిరింపు ఉత్తరాలు మెయిల్‌బాక్స్‌లో ఉండగా సోమవారం ఇస్లామిక్ ఎడ్యుకేషన్ సొసైటి అధ్యక్షుడు చూసినట్టు ‘కౌన్సిల్ ఆన్ అమెరికన్ ఇస్లామిక్ రిలేషన్స్’ తెలిపింది. ఈ ఉత్తరాలను విద్వేషంతో కూడిన బెదిరింపు ఉత్తరాలుగా భావిస్తున్నామని, దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు చెప్పారు. ‘ఒక్కో ముస్లిం హత్యకు నేను 100 డాలర్ల చొప్పున బహుమతిగా ఇస్తాను’ అని ఆ ఉత్తరంలో పేర్కొన్నారు. ఇక్కడికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ముస్లిం కమ్యూనిటి సెంటర్‌కు కూడా ఇలాంటి సందేశంతో కూడిన బెదిరింపు ఉత్తరమే వచ్చిందని పోలీసులు తెలిపారు.