అంతర్జాతీయం

సరిహద్దుల్లో శాంతి, సుస్థిరతలకు విఘాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, మార్చి 3: దలైలామా అరుణాచల్‌ప్రదేశ్‌ను సందర్శిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చైనా శుక్రవారం భారత్‌ను హెచ్చరించింది. దీనివల్ల ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటాయని, వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో శాంతి, సుస్థిరతలకు విఘాతం కలుగుతుందని హెచ్చరించింది. ‘్భరత్ అరుణాచల్‌ప్రదేశ్‌ను సందర్శించేందుకు దలైకి అనుమతిచ్చిందన్న సమాచారంపై చైనా తీవ్రంగా ఆందోళన చెందుతోంది’ అని చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షుయాంగ్ ఇక్కడ మీడియాకు చెప్పారు. అరుణాచల్‌ప్రదేశ్‌ను టిబెట్‌లో అంతర్భాగంగా చైనా పేర్కొంటోంది. ఉన్నత స్థాయి నాయకులు, అధికారులు, దౌత్యవేత్తలు ఎవరు ఆ ప్రాంతాన్ని సందర్శించినా అభ్యంతరం తెలియజేస్తోంది. అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా ఆ రాష్ట్రాన్ని సందర్శించడానికి భారత ప్రభుత్వం నిరుడు అక్టోబర్‌లో అనుమతిచ్చినప్పుడు కూడా చైనా ఆందోళన వ్యక్తం చేసింది. దలైలామా ఈ సంవత్సరం అరుణాచల్‌ప్రదేశ్‌ను సందర్శిస్తారని భావిస్తున్నారు. ‘వివాదాస్పద ప్రాంతాలను దలై సందర్శించడాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది’ అని జెంగ్ పేర్కొన్నారు. ‘చైనా తూర్పు ప్రాంతం, భారత్ సరిహద్దు వివాదంపై చైనా వైఖరి స్థిరంగా, స్పష్టంగా ఉంది. దలై ముఠా దీర్ఘకాలంగా చైనా వ్యతిరేక వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడుతోంది. సరిహద్దుకు సంబంధించిన సమస్యలపై ఈ ముఠా చరిత్ర బాగాలేదు’ అని జెంగ్ అన్నారు. చైనా సంప్రదాయ మార్గాల ద్వారా తన ఆందోళనను భారత్ దృష్టికి తీసుకెళ్లిందని ఆయన చెప్పారు. ‘దలై అంశం తీవ్రత, చైనా-్భరత్ సరిహద్దు సమస్య సున్నితత్వం గురించి భారత్‌కు పూర్తి అవగాహన ఉంది’ అని జెంగ్ వ్యాఖ్యానించారు. ‘ఇలాంటి నేపథ్యంలో భారత్ వివాదాస్పద భూభాగాన్ని సందర్శించడానికి దలైకి అనుమతిస్తే ఇరు దేశాల సరిహద్దు ప్రాంతంలో శాంతికి, సుస్థిరతకు, చైనా-్భరత్ సంబంధాలకు తీవ్ర విఘాతం కలుగుతుంది’ అని ఆయన అన్నారు.
సరిహద్దు సమస్యపై ఇప్పటికే ఇరు దేశాల మధ్య కుదిరిన ముఖ్యమైన అంగీకారాలకు, రాజకీయ నిబద్ధతకు కట్టుబడి ఉండాలని భారత్‌ను చైనా కోరినట్టు ఆయన చెప్పారు.