అంతర్జాతీయం

ఔట్‌సోర్సింగ్ అణచివేతకు ఉపక్రమించిన అమెరికా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 3: భారత్ వంటి దేశాలకు అమెరికా ఉద్యోగాల తరలిపోతున్నాయని గత కొంత కాలంగా పేర్కొంటున్న అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాంటి చర్యలను నిరోధించడానికి ఉపక్రమించారు. ట్రంప్ ప్రభుత్వం ఇందుకోసం ఒక బిల్లును శుక్రవారం అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే విదేశాలలో కాల్ సెంటర్లు తెరచిన అమెరికా కంపనీలు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయాన్ని పొందటానికి, రుణ హామీలకు అర్హత కోల్పోతాయి. ‘ద యుఎస్ కాల్ సెంటర్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్’ అనే ఈ బిల్లును డెమొక్రటిక్ పార్టీ సభ్యుడు జెనె గ్రీన్, రిపబ్లికన్ పార్టీ సభ్యుడు డేవిడ్ మెక్‌కినే్ల సభలో ప్రవేశపెట్టారు. తమ సేవల పనులన్నింటిని లేదా అత్యధికం పనులను విదేశాలలో నిర్వహించే అమెరికా కంపనీలను ఈ బిల్లు నిరుత్సాహపరుస్తుంది. ఇలాంటి కంపనీలను ‘బ్యాడ్ యాక్టర్స్’గా ప్రకటిస్తారు. ఇవి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయాన్ని పొందటానికి, రుణ హామీకి అర్హతను కోల్పోతాయి. ‘బ్యాడ్ యాక్టర్స్’ అనే జాబితాను రూపొందించడం ద్వారా కంపనీలు అమెరికాలోనే తమ కాల్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. విదేశాలలో కాల్ సెంటర్లు ఉన్న అమెరికా కంపనీలు ఆ కాల్ సెంటర్లు ఏయే ప్రదేశాలలో ఉన్నాయో కూడా ప్రజలకు తెలియజేయడాన్ని ఈ బిల్లు తప్పనిసరి చేస్తోందని బిల్లును ప్రవేశపెడుతూ ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు చెప్పారు.
అమెరికాలోని కాల్‌సెంటర్ ఉద్యోగాలు భారత్, ఫిలిప్పీన్స్, తదితర దేశాలకు తరలిపోవడం దురదృష్టకరమని వారు పేర్కొన్నారు.