అంతర్జాతీయం

అమెరికాలో మరో విద్వేష హత్య?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, మార్చి 4: అమెరికాలో జాత్యహంకార దాడిలో తెలుగు యువ ఇంజనీర్ శ్రీనివాస్ మరణ వార్తనుంచి తేరుకోకముందే మరో భారతీయ వ్యాపారిని దుండగులు దారుణంగా కాల్చి చంపారు. సౌత్ కరోలినా రాష్ట్రంలోని లాంకాస్టర్ కౌంటీలో హర్నీష్ పటేల్ (43) గురువారం రాత్రి 11.33 గంటల ప్రాంతంలో దుకాణం మూసేసి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఆయన ఇంటికి సమీపంలోనే గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఇటీవల కాన్సాస్‌లోని బార్‌లో ఓ అమెరికన్ జరిపిన కాల్పుల్లో శ్రీనివాస్ కూచిభొట్ల మృతి చెందగా, అతని స్నేహితుడు అలోక్, మరో అమెరికన్ గ్రిల్లాట్ గాయాలతో బైటపడిన విషయం తెలిసిందే. శ్రీనివాస్ మృతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విచారం వ్యక్తం చేసిన రెండు రోజులకే మరో భారతీయుడు హత్యకు గురి కావడం ఆందోళనకు గురి చేస్తోంది. పటేల్ మృతిపై దర్యాప్తు జరుపుతున్నామని,
దర్యాప్తు కొనసాగుతుండగా, ఇది జాత్యహంకార దాడి అని చెప్పలేమని లాంకాస్టర్ కౌంటీ పోలీసు అధికారి బారీ ఫైలీ విలేఖరులకు చెప్పారు. గురువారం రాత్రి ఒక మహిళ పోలీసులకు ఫోన్ చేసి ఒక వ్యక్తి అరుపులు, తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయని చెప్పడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పటేల్ ఇంటికి కొద్ది దూరంలోనే ఆయన మృత దేహం రక్తపు మడుగులో పడి ఉండగా కనుగొన్నారని ‘ది హెరాల్డ్’ పత్రిక తెలిపింది. పటేల్ ఇంటికి, ఆయన దుకాణం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. రాత్రి 11.22 గంటల సమయంలో దుకాణం మూసివేసిన తర్వాత పటేల్ తన కారులో ఇంటికి బయలుదేరాడు. అయితే మరికొద్ది నిమిషాల్లో ఇల్లు చేరుకోనుండగా ఈ దారుణం జరిగిపోయింది. కాగా, పటేల్ హంతకుడితో గొడవ పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
కాగా, పటేల్ ఎంతో దయగల వ్యక్తి అని తన కస్టమర్ల పట్ల మర్యాదగా ప్రవర్తించే వాడని, కష్టాల్లో ఉండే వారిని ఆదుకునే వాడని అతని మిత్రులు, కస్టమర్లు చెప్తున్నారు. పటేల్‌కు భార్య, ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్న ఒక కుమార్తె ఉన్నారు. హత్య జరిగిన సమయంలో వారు ఇంట్లోనే ఉన్నారు. ఈ హత్య పట్ల లాంకాస్టర్ ప్రాంతంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పటేల్ మృతి పట్ల లాంకాస్టర్ ప్రాంతంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పటేల్‌కు చెందిన ఎబిసి స్టోర్ వద్ద అభిమానులు, కస్టమర్లు ఆయనకు నివాళులర్పించారు. కుటుంబ సమస్య కారణంగా స్టోర్స్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు దుకాణం బైట ఒక బోర్డు కూడా పెట్టారు.

చిత్రం..హర్నీష్ పటేల్ (ఫైల్‌ఫొటో)