అంతర్జాతీయం

ఒబామా నా ఫోన్ ట్యాప్ చేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 4: నిత్యం వివాదాస్పద ప్రకటనలు చేస్తూ వార్తల్లోకి ఎక్కుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వివాదాస్పద ప్రకటన చేశారు. తనకన్నా ముందు అధ్యక్షుడుగా ఉండిన బరాక్ ఒబామా అధ్యక్ష ఎన్నికలకు ముందు న్యూయార్క్‌లోని తన కార్యాలయం ఫోన్‌ను ట్యాపింగ్ చేశారని ఆయన ఆరోపించారు. అంతేకాదు, ఈ వ్యవహారాన్ని ఆయన ‘వాటర్‌గేట్’ కుంభకోణంతో పోల్చారు. శనివారం ట్విట్టర్‌లో ఈ ఆరోపణలు చేసిన ట్రంప్ తన ఆరోపణకు తగిన ఆధారాలను మాత్రం తెలపలేదు. అంతేకాదు తన కార్యాలయాన్ని ట్యాప్ చేయరాదని కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఒబామా ధిక్కరించారని కూడా ఆయన పేర్కొన్నారు. న్యూయార్క్‌లోని తన కార్యాలయం ఫోన్లు ట్యాప్ చేయడాన్ని 1970 దశకం ప్రారంభంలో జరిగిన వాటర్ గేట్ కుంభకోణంతో పోల్చిన ట్రంప్ ఒబామాను ‘దుష్టబుద్ధి’గా అభివర్ణించారు కూడా.
కాగా, అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలో రష్యా రాయబారిని కలిసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్‌ను కూడా ట్రంప్ మరో ట్వీట్‌లో గట్టిగా సమర్థించారు. సెషన్స్‌ను కలిసిన రష్యా రాయబారి ఒబామా వైట్‌హౌస్‌ను 22 సార్లు సందర్శించారని ఆయన ప్రత్యారోపణ చేశారు. కాగా, ట్రంప్ చేసిన ఆరోపణలపై ఒబామా కార్యాలయం వెంటనే స్పందించలేదు.