అంతర్జాతీయం

ఇమిగ్రేషన్ సంస్కరణల్లో భాగమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 4: హెచ్-1బి వీసాల సమస్య తమకు ప్రధానమైనది కాదని, ట్రంప్ ప్రభుత్వం చేపట్టబోయే విస్తృతస్తాయి ఇమిగ్రేషన్ సంస్కరణల ప్యాకేజిలో భాగంగానే ఇది ఉంటుందని అమెరికా మన దేశానికి హామీ ఇచ్చింది. హెచ్-1బి వీసాల వినియోగాన్ని తగ్గించేందుకు ట్రంప్ ప్రభుత్వం కార్యనిర్వాహక ఉత్తర్వులను జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో హెచ్-1బి వీసాల అంశానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని అమెరికా అధికారులు వివరణ ఇవ్వడం గమనార్హం. భారతీయ ఐటి రంగం సేవలను ట్రంప్ ప్రభుత్వం గుర్తించినట్లుగా కనిపిస్తోందని, ఇమిగ్రేషన్ సమస్య గురించే వారు ఎక్కువ ఆందోళన చెందుతున్నారని, అందువల్ల పూర్తిస్థాయి ఇమిగ్రేషన్ ప్యాకేజిలో భాగంగానే ఇది కూడా ఉంటుందని అమెరికా అధికారులతో చర్చలు జరిపిన అనంతరం కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రీటా తియోటియా శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్ జైశంకర్‌తో పాటుగా తియోటియా కూడా ప్రస్తుతం అమెరికాలో ట్రంప్ ప్రభుత్వ ఉన్నతాధికారులతో, అమెరికా కాంగ్రెస్ సభ్యులతోను చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. హెచ్-1బి వీసాల అంశాన్ని భారత ప్రభుత్వం అమెరికా అధికారుల దృష్టికి చాలా సీరియస్‌గా తీసుకెళ్తోందని ఆమె చెప్పారు. హెచ్-1బి వీసాల అంశం వాణిజ్యం, సేవల విభాగంలోకి వస్తుందని, ఇది ఆర్థికపరమైన అంశం కాదనే విషయాన్ని, అందువల్ల భారత్, అమెరికాల మధ్య భాగస్వామ్యం పెరగడం అమెరికాకే ఎక్కువ ప్రయోజనకరమవుతుందనే విషయాన్ని అమెరికా అధికారులకు గట్టిగా వివరించినట్లు జైశంకర్ సైతం చెప్పారు. అమెరికా కాంగ్రెస్‌నుద్దేశించి చేసిన ప్రసంగంలో ట్రంప్ సైతం ఈ విషయంలో ప్రతిభ ఆధారిత వైఖరిని అనుసరిస్తామని చెప్పారని ఆయన అంటూ, ఏది ఏమయినా అమెరికాలో భారతీయుల నైపుణ్యం పట్ల ఎంతో గౌరవం వ్యక్తమవుతోందని అన్నారు.