అంతర్జాతీయం

కాన్సాస్ కాల్పులు వ్యక్తిగత చర్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 4: అమెరికాలోని కాన్సాస్‌లో జరిగిన కాల్పుల ఘటనను వ్యక్తిగత చర్యగా పరిగణించాలని భారత విదేశాంగ కార్యదర్శి జైశంకర్ అన్నారు. అమెరికా నేవీకి చెందిన వ్యక్తి జరిపిన ఈ కాల్పుల్లో హైదరాబాద్ టెకీ శ్రీనివాస్ కూచిభొట్ల మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల ఘటనను వ్యక్తిగత చర్యగా పరిగణించాలని, అమెరికా పాలనా వ్యవస్థ, అమెరికా సమాజం ఈ దుశ్చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ పాలనా యంత్రాంగంతో విస్తృత స్థాయిలో చర్చలు జరపడానికి ఇక్కడికి వచ్చిన జైశంకర్ మీడియాతో మాట్లాడుతూ తమ చర్చలలో ఈ కాల్పుల ఘటన ప్రస్తావనకు వచ్చిందని తెలిపారు. ‘ఒక వ్యక్తి జరిపిన దుశ్చర్యగా ఈ ఘటనను పరిగణించాలని అమెరికా ఉన్నత స్థాయి, క్యాబినెట్ స్థాయి నేతలు కోరారు. అమెరికా న్యాయ వ్యవస్థ ఈ ఘటనను పరిశీలిస్తోంది. ఈ దుశ్చర్యకు పాల్పడిన దుండగుడిని న్యాయస్థానం ముందు నిలబెడుతుంది. ఈ కేసును జాతివిద్వేష నేరంగా విచారిస్తుంది’ అని జైశంకర్ వివరించారు.