అంతర్జాతీయం

మత స్వేచ్ఛపై ఆంక్షలు హక్కుల ఉల్లంఘనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 4: భారత్‌లో విదేశీ విరాళాలు స్వీకరిస్తున్న స్వచ్ఛంద సంస్థలపై, మత స్వేచ్ఛపై ఆంక్షలు విధించడం, అవినీతి, పోలీసు, భద్రతా దళాల అధికార దుర్వినియోగం వంటివి మానవ హక్కుల ఉల్లంఘనల్లో ఉన్నాయని అమెరికా ప్రభుత్వం రూపొందించిన నివేదిక వెల్లడించింది. ట్రంప్ పాలనాయంత్రాంగం హయాంలో భారత్‌లో 2016లో మానవ హక్కుల అమలుపై అమెరికా విదేశాంగ శాఖ రూపొందించిన ఈ తొలి నివేదికలో అదృశ్యం, జైళ్లలో నెలకొన్న ప్రమాదకరమైన పరిస్థితులు, న్యాయ వ్యవస్థలో ఉద్యోగ ఖాళీల వల్ల ఆలస్యమవుతున్న న్యాయం వంటి వాటిని మిగతా మానవ హక్కుల ఉల్లంఘనలుగా పేర్కొన్నారు. పోలీసు, భద్రతా దళాల అధికార దుర్వినియోగం, వేధింపులు, అత్యాచారాలు, విస్తృతంగా వ్యాపించిన అవినీతి, తత్ఫలితంగా నేరాలపై సమర్థవంతంగా స్పందించకపోవడం, మహిళలు, పిల్లలు, ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న నేరాలకు న్యాయం జరగకపోవడం, లింగం, మతం, కులం, తెగ ఆధారంగా జరుగుతున్న సామాజిక హింస వంటివి ప్రధానంగా మానవ హక్కుల ఉల్లంఘనల్లో ఉన్నాయని శుక్రవారం విడుదలయిన ఈ నివేదిక పేర్కొంది.