అంతర్జాతీయం

వీసాలుంటే దిగుల్లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 6: శరణార్థులు, వలసల్ని కట్టడి చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం మరో కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. మొదటి ఉత్తర్వులో పేర్కొన్న కొన్ని అంశాల్లో మార్పులు చేశారు. ఈ సారి నిషేధం వేటు నుంచి ఇరాక్‌ను మినహాయించి మిగిలిన ఆరు దేశాలకూ వర్తింపచేశారు. తాజా నిషేధ జాబితాలో సూడాన్, లిబియా, సిరియా, ఇరాన్, సోమాలియా, యెమన్ దేశాలు ఉన్నాయి. వీటికి చెందిన పౌరులు అమెరికాలోకి రాకుండా 90రోజుల పాటు నిషేధం అమలు అవుతుంది. మొదటి ఉత్తర్వు వల్ల తలెత్తిన గందరగోళ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ సారి అలాంటి అంశాలకు తావు లేకుండా చట్టపరంగా, న్యాయపరంగా జాగ్రత్తలు తీసుకున్నట్టు హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. ఈ నెల 16 నుంచి కొత్త ఉత్తర్వు అమలులోకి వస్తుంది. గ్రీన్ కార్డు ఉన్నవారికి, న్యాయపరమైన శాశ్వత ఆవాసదారులకు ఈ కొత్త ఉత్తర్వు వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని, వీరు తిరిగి అమెకాలో ప్రవేశించవచ్చునని విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లెర్సన్ తెలిపారు.అయితే తొలి ఉత్తర్వుపై సంతకం జరిగిన జనవరి 27నాటికే లేదా అంతకు ముందే వీరికి వీసాలు ఉండాలని తెలిపారు.కొత్త ఉత్తర్వు వల్ల అమెరికా, దాని మిత్ర దేశాలకు భద్రతాపరంగా మరింత బలం చేకూరినట్టు అవుతుందని తెలిపారు. అలాగే శరణార్థుల ప్రవేశానికి సంబంధించి 120 రోజుల పాటు నిషేధం అమలులోకి వస్తుందన్నారు. సిరియాకు చెందిన వారిపై గత ఉత్తర్వులో పేర్కొన్నట్టుగా నిరవధిక నిషేధం అమలు కాదని టిల్లర్సన్ వివరించారు. ఇప్పటి వరకూ మీడియా సమక్షంలోనే ఉత్తర్వులు జారీ చేస్తూ వచ్చిన ట్రంప్ తాజా ఉత్తర్వుపై మాత్రం ఎలాంటి హడావుడి లేకుండా సంతకం చేశారు. 90 రోజుల పాటు నిషేధం విధించడం వల్ల ఆయా దేశాలకు చెందిన ఉగ్రవాదులు, నేరచరితులు అమెరికాలోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన రీతిలో వడపోత కార్యక్రమాన్ని అమలు చేయడం సాధ్యమవుతుందని ఈ ఉత్తర్వులో స్పష్టం చేశారు. ఇరాక్‌ను మినహాయించడానికి కారణం అమెరికా వీసాలకు దరఖాస్తు చేసుకునే తమ పౌరులను అన్ని విధాలుగా వడపోస్తామని హామీ ఇవ్వడమేనని తెలిపారు. తాము తీసుకున్న జాగ్రత్తల వల్ల ఈసారి ఎలాంటి ఇబ్బంది ఉండదన్న ధీమాను అధికారులు వ్యక్తం చేశారు. తగిన పత్రాలు ఉంటే అమెరికాలోకి అనుమతిస్తామని..అలాంటి వాళ్లు ఇబ్బంది పడాల్సిన అవసరమే ఉండదని తెలిపారు. విస్తృత స్థాయిలో చేపట్టే వడపోత అనంతరం నిషేధ జాబితాలో చేర్చాల్సిన వాటి పేర్లను సూచించాలని అధ్యక్షుడు ట్రంప్ కోరినట్టుగా విదేశాంగ, హోంల్యాండ్ విభాగం అధికారులు తెలిపారు. కొత్త ఉత్తర్వుత అమెరికా మరింత సురక్షితం అవుతుందని, ఇమిగ్రేషన్‌పై తలెత్తిన భద్రతాపరమైన సందేహాలను ఇది తీరుస్తుందని దేశీయ భద్రతా మంత్రి జాన్ ఎఫ్ కెల్లీ తెలిపారు. ఇమిగ్రేషన్ విధానాన్ని ఆసరా చేసుకుని అక్రమంగా దేశంలోకి ఎవరూ ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు, తనిఖీలు చేపడతామన్నారు. మొదటి 20రోజుల పాటు అన్ని దేశాల నుంచి భద్రతాపరమైన సమాచారాన్ని సేకరిస్తామని, వీటి నాణ్యత లేదా చెల్లుబాటును నిర్థారించేందుకు ఆయా దేశాలకు మరో 50రోజుల పాటు గడువు ఇస్తామని తెలిపారు.

చిత్రం..ఉత్తర్వుపై సంతకం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్