అంతర్జాతీయం

చిన్నారులపై కాలుష్యం పడగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెనీవా, మార్చి 6: వాతావరణంలో పెచ్చుమీరుతున్న కాలుష్యం చిన్నారులపై పడగ చాచింది. ప్రతి నలుగురు పిల్లల్లో ఒకరు కాలుష్యానికి బలవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 17లక్షల మంది పిల్లలు ఈ కారణంగానే మరణిస్తున్నారని ఈ నివేదిక సోమవారం వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్యసంస్థ ఏటా ఇంట్లో, బయటా వాతావరణ కాలుష్యం, ఇతరులు వదిలిన సిగరెట్ పొగను పీల్చటం, అపరిశుభ్ర నీరు, పారిశుధ్య లేమి వంటి వాటి వల్ల పసి పిల్లలు మృత్యువాత పడుతున్నారని నివేదికలో వెల్లడించారు. ఒక నెల వయసు నుంచి అయిదేళ్ల వయసు ఉన్న పిల్లలు ఈ కాలుష్యం వల్ల డయేరియా, మలేరియా, న్యుమోనియా వంటి రోగాల బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డా.మార్గరెట్ చాన్ అన్నారు. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే ఆమె శ్వాస ప్రక్రియ ద్వారా పిల్లలపై కాలుష్యం ప్రభావం పడుతున్నదని పేర్కొన్నారు. దీని వల్ల సమయానికి ముందే డెలివరీ అయ్యే ప్రమాదం ఉందన్నారు. అంతే కాదు చిన్నప్పటి నుంచే న్యుమోనియా దాడి చేసే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రతి సంవత్సరం 5.70లక్షల మంది పిల్లలు శ్వాసకోశ వ్యాధుల కారణంగా మరణిస్తున్నారని, వారిలో 3.61లక్షల మంది అయిదేళ్ల లోపు చిన్నారులని నివేదికలో పేర్కొన్నారు. వీరిలో 2.70లక్షల మంది పిల్లలు నెలలోపు వయసులోనే ప్రాణాలు వదులుతున్నారని తెలిపారు. రెండు లక్షల మంది మలేరియా కారణంగా చనిపోతున్నారని, మరో రెండు లక్షల మంది కలుషిత నీటితో చనిపోతున్నారన్నారు.