అంతర్జాతీయం

దాడులపై దర్యాప్తు వేగవంతం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 6: ఇండియన్-అమెరికన్లపై జరుగుతున్న దాడులకు సంబంధించి దర్యాప్తు వేగిరం చేసి బాధితులకు తగు న్యాయం జరిగేలా చూస్తామని అమెరికా హామీ ఇచ్చింది. మరోపక్క ఎన్నారైలపై జరుగుతున్న విద్వేషపూరితపైన దాడులపై అమెరికా విదేశాంగ శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ‘అమెరికా ప్రభుత్వం తరఫున యుఎస్ విదేశాంగశాఖ దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బాధితులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించింది’ అని అమెరికాలోని రాయబార కార్యాలయం వెల్లడించింది. దీనిపై భారత రాయబారి నవ్‌తేజ్ శరణ్ వరస ట్వీట్లు చేశారు. అమెరికాలో తాజాగా చోటుచేసుకున్న ఘటనలను యుఎస్ విదేశాంగ శాఖ దృష్టికి శరణ్ తీసుకొచ్చారు. అమెరికా విదేశాంగ కార్యాలయానికి చేరుకున్న ఆయన ఎన్నారైలపై జరుగుతున్న దాడుల విషయమై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణ కరోలినాలోని లాన్‌కేస్టర్ కంట్రీలో హర్నీష్ పటేల్ (43), కెంట్‌లో దీప్ రాయ్‌లపై జరిగిన కాల్పుల ఘటనలను ఆయనీ సందర్భంగా ప్రస్తావించారు. పటేల్ దుండగుల కాల్పుల్లో చనిపోయారు. 39 ఏళ్ల రాయ్ అనే సిక్కు యువకుడిపై ఇంటి ముందే కాల్పులు జరిగాయని రాయబారి వివరించారు. ప్రవాస భారతీయుల భద్రతకు చర్యలు తీసుకోవడంతోపాటు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని శరణ్ నేతృత్వంలోని ఎంబసీ అధికారుల బృందం కోరింది. ఈ రెండు ఘటనలను స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్టు వారు వెల్లడించారు.
కెంట్ కాల్పులపై దిగ్భ్రాంతి
కెంట్‌లో భారత సంతతికి చెందిన సిక్కు యువకుడిపై జరిగిన కాల్పుల ఘటనను ఇండియన్-అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు అమీబేరా తీవ్రంగా ఖండించారు. ఇవి ముమ్మాటికీ విద్వేషపూరిత దాడులేనని ఆయన ఆరోపించారు. కాల్పుల ఘటనపై ఎఫ్‌బిఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశం విడిచి వెళ్లిపోండి అంటూ ముసుగు ధరించి వచ్చిన ముష్కరుడు కాల్పులు జరిపాడని ఆయన అన్నారు. కాగా దీపక్ రాయ్‌పై జరిగిన కాల్పులపై సిక్కు కమ్యూనిటీ సత్వీందర్ సింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి సీటెల్‌లో ఈ ఘటన చోటుచేసుకుందని, వరుస సంఘటనలో ఎన్నారైల్లో భయాందోళనలు నెలకొన్నాయని సింగ్ స్పష్టం చేశారు. కాగా ఈ కేసుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ దర్యాప్తు చేస్తున్నట్టు కెంట్ పోలీసు చీఫ్ కెన్ థామస్ వెల్లడించారు. దిలీప్ రాయ్ చేతిపై గాయమైందన్న థామస్ ఇప్పటివరకూ ఎవర్నీ అరెస్టు చేయలేదని తెలిపారు.

చిత్రం..అమెరికాలో విద్వేష హత్యకు గురైన శ్రీనివాస్ కూచిభొట్ల సంతాప సభను దక్షిణాసియా కమ్యూనిటీ సభ్యులు వాషింగ్టన్‌లో నిర్వహించారు. ఈ సభకు హాజరైన భారతీయులు