అంతర్జాతీయం

విద్యార్థులపై చర్యలు సమంజసమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, ఏప్రిల్ 1: హైదరాబాద్ యూనివర్శిటీ(హెచ్‌సియు) అలాగే ఢిల్లీ జెఎన్‌యు విద్యార్థులపై తీసుకున్న చర్యలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గట్టిగా సమర్ధించుకున్నారు. ముంబయిపై దాడికి పాల్పడ్డ, అలాగే పార్లమెంటుపైన తెగబడ్డ వ్యక్తులను బహిరంగంగా కీర్తిస్తే సైద్ధాంతికంగా తీవ్ర స్థాయిలో ప్రతిస్పందన ఉంటుందన్నది ఎంతైనా వాస్తవమని జైట్లీ తెలిపారు. ఇలాంటి చర్యలను గర్హించే వ్యక్తులు ఎంత మాత్రం వౌనంగా ఊరుకునే అవకాశం ఉండదని వెల్లడించారు. భారత దేశం బలమైన, ధృడమైన ప్రజాస్వామ్య దేశమని 70 దశకం మధ్యలోనే దీనికి ఓక సారి తీవ్ర విఘాతం ఏర్పడిందని మెల్‌బోర్న్ వర్శిటీలో చేసిన ప్రసంగంలో ఆయన తెలిపారు. ప్రేక్షకులు అడిగిన అనేక ప్రశ్నలకు జైట్లీ సమాధానం చెప్పారు. జెఎన్‌యు, హెచ్‌సియుల్లో చోటుచేసుకున్న పరిణామాలను లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఎమర్జెన్సీ సమయంలో తాను 19 నెలలపాటు జైలులో ఉన్నానని గుర్తుచేసుకున్న జైట్లీ భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో రాజీపడేది లేదని అన్నారు. ఇప్పుడు జెఎన్‌యు విద్యార్థుల నిరసనలను బలపరుస్తున్న వ్యక్తులు నాడు ఎమర్జెన్సీని సమర్ధించినవారేనంటూ కాంగ్రెస్‌పై పరోక్షంగా ధ్వజమెత్తారు. పేదరికంతో పాటు భారత దేశంలో చాలా తీవ్రంగానే ఉగ్రవాద ప్రభావానికి గురైందని ఒక్క 1993లోనే ఈ మహమ్మారికి 300 మంది బలైయ్యారని జైట్లీ అన్నారు. దానిపై ఏళ్ల తరబడి జరిగిన విచారణ అనంతరం ఒక్కరు మాత్రమే దోషిగా రుజువయ్యారని వెల్లడించారు. అలాంటి వ్యక్తిని కీర్తిస్తూ హెచ్‌సియులో ఉత్సవం జరుపుకోవడం అన్నది క్షమార్హం కాదని చెప్పారు. అలాగే పార్లమెంటు దాడి కేసును కూడా ప్రస్తావించిన జైట్లీ అందుకు కుట్ర పన్నిన వ్యక్తిని కీర్తిస్తూ జెఎన్‌యులో ప్రదర్శన జరిగిందన్నారు. ఈకేసులోకూడా సుదీర్ఘ విచారణ జరిగిన తరువాత అతడిని దోషిగా నిర్ధారించినట్టు చెప్పారు.‘ ముంబయిపై దాడి చేసినా లేదా పార్లమెంటుపై తెగబడ్డా వారికి అనుకూలంగా బహిరంగంగా నినాదాలు చేస్తే..అంతేకాకుండా భారత్‌ను ముక్కలు ముక్కలు చేస్తామని హెచ్చరిస్తే కచ్చితంగా దీనికి ప్రతిస్పందన ఉంటుంది’అని పేర్కొన్నారు.