అంతర్జాతీయం

అమెరికాలో భారత సంతతి మహిళకు అవమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టొరాంటో, మార్చి 9: కెనడాలో ఉంటున్న ఓ భారత సంతతి మహిళను అమెరికాలోకి ప్రవేశించకుండా అధికారులు అడ్డుకున్నారు. 39 ఏళ్ల మన్‌ప్రీత్ కూనూర్ కెనడా పౌరురాలు. మాంట్రియల్‌లో ఉంటున్న ఆమె అమెరికాలోని వెర్మెంటో వెళాల్లనుకుని గత ఆదివారం మరో ఇద్దరు స్నేహితులతో కలిసి బయలుదేరారు. ఈ రెండు ప్రదేశాలు కూడా కెనడా-అమెరికా సరిహద్దులోనే ఉన్నాయి. అయితే ఆమెతో పాటుగా ఉన్న ఇద్దరు స్నేహితులు శే్వతజాతీయులు కావడంతో అధికారులు వారిని అడ్డుకోలేదు. మన్‌ప్రీత్‌ను మాత్రం ఇమిగ్రెంట్ వీసా ఉండాలంటూ ఆపేశారు. దాదాపు ఆరుగంటల పాటు వేలిముద్రలు, ఫోటోలు తీసుకోవడంతో పాటు పలురకాల ప్రశ్నలు వేశాక ప్రవేశానికి నిరాకరించారని మన్‌ప్రీత్ ఫేస్‌బుక్ పోస్టుద్వారా తెలిపారు. తాను ఇమిగ్రెంట్‌నని, అమెరికాలోకి ప్రవేశించాలంటే సరయిన వీసాతో రావాలని అధికారులు చెప్పారని, తనకు ఇది నమ్మశక్యంగా లేదని ఆమె పేర్కొన్నారు. ‘ట్రంప్ ప్రభావానికి (ట్రంప్డ్) గురైనట్లు మీరు భావిస్తున్నారని నాకు తెలుసు’ అని బార్డర్ ఏజంట్ అన్నాడని ఆమె చెతెలిపారు. దేశంలోకి అక్రమ వలసలను నిరోధించడం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరు ముస్లిం మెజారిటీ దేశాల పౌరులు అమెరికాలోకి రాకుండా తాత్కాలిక నిషేధం విదించడం తెలిసిందే.