అంతర్జాతీయం

హిందూ వివాహ బిల్లుకు మోక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, మార్చి 10: పాకిస్తాన్ పార్లమెంట్ సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న హిందూ వివాహ బిల్లుకు ఆమోదం తెలిపింది. పాకిస్తాన్‌లో మైనారిటీ వర్గమైన హిందువుల వివాహాలను క్రమబద్దీకరిస్తూ తీసుకొచ్చిన ఈ బిల్లు ఓ మైలురాయిగా చెప్పవచ్చు.
హిందూ మ్యారేజ్ బిల్లు 2017కు జాతీయ అసెంబ్లీ గురువారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. పార్లమెంటులో ఈ బిల్లుకు ఆమోదం తెలవడం ఇది రెండోసారి. గత ఏడాది సెప్టెంబర్‌లో ఓసారి ఆమోదం లభించింది. అయితే బిల్లుకు సెనేట్ ఫిబ్రవరిలో కొన్ని మార్పులు సూచించింది. నిబంధనల ప్రకారం ఒక బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభల్లో రెండు సార్లు ఆమోదం తెలపాల్సి వచ్చినప్పుడు రాష్టప్రతి సంతకం తప్పనిసరని డాన్ పత్రిక వెల్లడించింది. పార్లమెంటు ఆమోదించిన షాదీ పరాథ్ డాక్యుమెంట్ ముస్లింల నిఖానమా లాగే ఉంటుంది.
షాదీ పరాథ్‌పై పండిట్ సంతకం తప్పనిసరి. అలాగే సంబంధిత ప్రభుత్వ శాఖ వద్ద దాన్ని రిజిస్టర్ చేయించాలి. డాక్యుమెంట్ కూడా పూర్తి చేయడం ఎంతో సులభం. మొత్తం ఎనిమిది కాలమ్స్ ఉంటాయి. పెళ్లితేదీ, రాష్ట్రం, తాలూకా, పట్టణం, జిల్లా వివరాలు పూరించాలి. పెళ్లి కొడుకు పేరు, అతడి తండ్రి పేరు,పుట్టిన తేదీ, పెళ్లి ఎక్కడ జరిగింది?, తాత్కాలిక చిరునామా తెలపాలి. అలాగే ఇంతకు ముందే పెళ్లయిందా?, అవివాహితులా, విడాకులు తీసుకున్నారా, విడోవరా?, తనపై ఎంత మంది ఆధారపడి ఉన్నారు అన్న వివరాలు ధృవపత్రలో పేర్కొనాలి. పెండ్లి కుమార్తె కూడా దాదాపుఇవే వివరాలు అందజేయాలి. అయితే ఒక మార్పు చేశారు. తల్లిపేరు కచ్చితంగా రాయాల్సి ఉంటుంది. వధూవరులు ఇద్దరూ కూడా రిజిస్ట్రార్ ఎదుట ధృవపత్రంపై సంతకం చేయాల్సి ఉంటుందని బిల్లులో పొందుపరిచారు. ఈ బిల్లు వల్ల హిందూ మహిళలకు ఎంతో భరోసా లభిస్తుంది. ఆమెకు ఇదో డాక్యుమెంటరీ ప్రూఫ్. పార్లమెంట్‌లో అధికార పిఎంఎల్-ఎన్ సభ్యుడు కమ్రాన్ మైఖెల్ బిల్లును ప్రతిపాదించారు. ఆయన పాకిస్తాన్ మానవ హక్కుల మంత్రిగా ఉన్నారు.