అంతర్జాతీయం

అమెరికా ప్రాసిక్యూటర్ భరారాపై ట్రంప్ వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్/వాషింగ్టన్, మార్చి 12: అమెరికాలో ఉన్నత స్థాయి ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తున్న ప్రవాస భారతీయుడు ప్రీత్ భరారాను డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అర్ధాంతరంగా తొలగించింది. అవినీతి వ్యతిరేక పోరాట యోధుడిగా మంచి పేరు తెచ్చుకున్న భరారా (48) తన పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరించడంతో ఆయనపై ట్రంప్ సర్కారు వేటు వేసింది. భరారాతో పాటు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో నియమితులైన మరో 45 మంది ప్రాసిక్యూటర్లను తక్షణమే పదవులకు రాజీనామా చేయాలని ట్రంప్ ప్రభుత్వం ఆదేశించగా, అందుకు భరారా నిరాకరించారు. ‘పదవికి నేను రాజీనామా చేయలేదు. కానీ కొద్దిసేపటి క్రితమే నన్ను పదవి నుంచి తొలగించారు. నేను ఎంత కాలం జీవిస్తాను, ఏమి చేస్తాను అన్నది అప్రస్తుతం. కానీ ఎస్‌డిఎన్‌వై (సదరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్)లో గత ఏడేళ్ల నుంచి అమెరికా అటార్నీగా దేశానికి సేవలు అందించే అవకాశం లభించడాన్ని నా వృత్తిగత జీవితంలోనే ఎంతో మహోన్నతమైన గౌరవంగా భావిస్తున్నా. ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించడంలో నాకు పూర్తి సహాయ సహకారాలు అందజేసిన ఎస్‌డిఎన్‌వై ప్రజలకు వినమ్రంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా’ అని భరారా తెలిపారు.