అంతర్జాతీయం

సీటు బెల్టు ఆవశ్యకతపై బ్రిటన్‌లో భారత మాతృమూర్తి ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మార్చి 13: వాహనాల్లో ప్రయాణించేవారు తప్పనిసరిగా సీటు బెల్టును ధరించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన సుఖీ అత్వాల్ అనే మాతృమూర్తి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. బ్రిటన్‌లో సుమారు రెండేళ్ల క్రితం కారు ప్రమాదంలో 12 ఏళ్ల వయసున్న కుమారుడిని కోల్పోయిన సుఖీ అత్వాల్ తన కుమారుడి స్మృత్యర్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టి కార్లలో ప్రయాణించే వారికి సీటు బెల్టు ధరించడం వలన ఒనగూడే ప్రయోజనాలు ఏమిటో వివరిస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆమె 2015 మే నెలలో తన కుమారుడు అమర్ ప్రాణాలను బలితీసుకున్న కారు ప్రమాద సీసీటీవి ఫుటేజీలను విడుదల చేశారు. సీటు బెల్టు ధరించకుండా అమర్ ప్రయాణిస్తున్న కారును మరో ట్యాక్సీ వేగంగా ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన అతను కొద్దిరోజుల తర్వాత బర్మింగ్‌హామ్ ఆసుపత్రిలో మృతి చెందాడు. ఆ విషాదం నుంచి తాము ఇప్పటికీ బయటపడలేకపోతున్నామని, ఎంతో తెలివైనవాడు, చురుకైనవాడు అయిన అమర్ దుర్మరణంతో తమ జీవితంలో ఏర్పడిన లోటు ఎప్పటికీ పూడదని, ఆ సమయంలో అమర్ సీటు బెల్టు ధరించి ఉంటే తమకు ఇంతటి విషాదం ఎదురయ్యేది కాదని సుఖీ అత్వాల్ తెలిపారు.