అంతర్జాతీయం

టెర్రర్ సంస్థలపై డ్రోన్ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 14: టెర్రరిస్టు సంస్థలపై డ్రోన్‌ల సాయంతో దాడులు చేసేందుకు అవసరమైన అధికారాలను అమెరికా నిఘా సంస్థ సిఐఏకు అధ్యక్షుడు ట్రంప్ కట్టబెట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మాజీ అధ్యక్షుడు ఒబామా విధానాల్లో ట్రంప్ చేస్తున్న మార్పుల్లో ఇది కూడా ఒకటి. ఒబామా యంత్రాంగం డ్రోన్‌ల సాయంతో దాడులు చేసే అధికారాన్ని రక్షణ శాఖకు అప్పగించింది. నిఘా సమాచారాన్ని సేకరించేందుకు మాత్రమే సిఐఏ డ్రోన్‌లను వినియోగిస్తూ వచ్చింది. అంతేకాకుండా మిలటరీ తాను సొంతంగా ఆపరేషన్లు నిర్వహించేందుకు అవసరమైన అధికారాలను కూడా సైన్యానికి ట్రంప్ ఇవ్వనున్నారని పేరు వెల్లడించటానికి నిరాకరించిన అధికారి ఒకరు వెల్లడించారు. ఇప్పటివరకు కేవలం నిఘా సమాచారం వరకే పరిమితమైన సిఐఏ ఇకపై తానే దాడులు నిర్వహించే అధికారాన్ని సాధించుకుంది. గత ఎనిమిది నెలలుగా అమెరికా డ్రోన్ దాడులను నిలిపివేసింది. ఇటీవలి కాలంలో పెంటగాన్ సీనియర్ జనరల్‌లు పాకిస్తాన్‌లో ఉగ్రవాద కార్యకలాపాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పైగా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై సిఐఏ నిర్వహించిన డ్రోన్ దాడులు విజయవంతం అయ్యాయి. కనీసం 50 మంది అల్‌ఖైదా, తాలిబాన్ ఉగ్రవాదులు ఈ దాడుల్లో హతమయ్యాయి. ఇప్పుడు సిఐఏకు పూర్తి అధికారాలు ఇవ్వటంతో దాని ఫలితాన్ని ముందుగా అనుభవించేది పాకిస్తానే అవుతుంది. దాదాపు వందకు పైగా ఉగ్రస్థావరాలున్న పాకిస్తాన్‌పై సిఐఏ పంజా విసరటం ఖాయమని నిపుణులు భావిస్తున్నారు.