అంతర్జాతీయం

నిధుల్లో అర్ధాంతరంగా కోతపెట్టొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, మార్చి 17: ఐక్యరాజ్య సమితికి అమెరికా ఇచ్చే నిధుల్లో అర్ధంతరంగా కోత పెట్టవద్దని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ హెచ్చరిస్తూ, ఐరాసకు అత్యధికంగా నిధులిచ్చే అమెరికా నిధులను తగ్గించినట్లయితే అది ఐరాస దీర్ఘకాలిక సంస్కరణ కృషిపై ప్రభావం చూపిస్తుందన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దౌత్యవ్యవహారాలకు, విదేశీ సహాయానికి భారీగా నిధులు తగ్గిస్తూ బడ్జెట్‌ను ప్రతిపాదించిన తర్వాత గుటెరస్ ఈ వ్యాఖ్యలు చేశారు. వైట్‌హౌస్ విడుదల చేసిన 2018 బడ్జెట్ బ్లూప్రింట్‌ను గుటెరస్ చూశారని, ఉమ్మడి లక్ష్యాలు, విలువలను కొనసాగించడానికి ఐరాసను ఖర్చులను తగ్గించుకునే సంస్థగా ఎలా తయారు చేయాలనే దానిపై అమెరికాతోను, ఇతర సభ్య దేశాలతోను చర్చించడానికి సిద్ధంగా ఉన్నారని ఐరాస ప్రధాన కార్యదర్శి ప్రతినిధి స్ట్ఫినే డుజరిక్ శుక్రవారం ఇక్కడ విలేఖరులకు చెప్పారు. హటాత్తుగా నిధుల్లో కోత పెట్టడం వల్ల తాత్కాలిక చర్యలను పాటించాల్సి వస్తుందని, ఇది దీర్ఘకాలిక సంస్కరణ ప్రయత్నాలపై ప్రభావం చూపిస్తుందని డుజరిక్ చెప్పారు.
2018 ఆర్థిక సంవత్సరానికి 1.1 లక్షల కోట్ల డాలర్ల వార్షిక బడ్జెట్‌ను ట్రంప్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఇందులో విదేశీ సహాయానికి 28 శాతం కోత పెట్టగా, రక్షణ వ్యయాన్ని 10 శాతం అంటే 54 బిలియన్ డాలర్లకు పెంచాలని ప్రతిపాదించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమెరికా రక్షణ బడ్జెట్‌ను 30 బిలియన్ డాలర్ల మేరకు పెంచిన విషయం తెలిసిందే. అయితే ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి సైన్యంపై ఖర్చును పెంచినంతమాత్రాన సరిపోదని, ఘర్షణలను పరిష్కరించడంపైన, హింసాత్మక తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంపైన పెట్టుబడి పెట్టడం ద్వారా ఉగ్రవాదం వెనుక ఉన్న అసలు కారణాలను సభ్యదేశాలు కనుగొనాలని కూడా గుటెరస్ అన్నారు.‘ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలనే విషయాన్ని ఐరాస ప్రధాన కార్యదర్శి పూర్తిగా సమర్థిస్తున్నారు. అయితే దీనికి సైన్యంపై ఖర్చును మించి చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది’ అని డుజరిక్ అన్నారు.
ఐక్యరాజ్య సమితికి నిధులు అందించే దేశాల్లో అమెరికాయే అగ్రస్థానంలో ఉంది. 540 కోట్ల డాలర్ల ఐరాస ప్రధాన బడ్జెట్ 22 శాతం, 790 కోట్ల శాంతిపరిరక్షణ బడ్జెట్‌లో 28.5 శాతం నిధులు అమెరికాయే ఇస్తోంది. అమెరికా ఐరాసకు శాంతిపరిక్షణకోసం ఇచ్చే నిధుల్లో 130 కోట్ల డాలర్లు, రెగ్యులర్ బడ్జెట్ నిధుల్లో 91.7 కోట్ల డాలర్లు బకాయి ఉన్నట్లు గత ఏడాది ఐరాస మేనేజిమెంట్‌కు సంబంధించిన అండర్ సెక్రటరీ జనరల్ యుకియో తకాసు చెప్పారు.
అయితే చాలా విషయాల్లో ఐరాస ఖర్చు చేయాల్సిన దానికన్నా ఎక్కువ ఖర్చు చేస్తోందని, అంతేకాకుండా మిగతా దేశాలకన్నా కూడా అమెరికాపై ఎక్కువ ఆర్థిక భారం మోపుతోందని ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ ఒక ప్రకటనలో ఆరోపించారు. అయితే అమెరికా ఐరాస శాంతిపరిరక్షణ రంగానికి, ఇతర రంగాలకు నిధులను హటాత్తుగా తగ్గించడంపై అంతర్జాతీయ మానవ హక్కుల గ్రూపు ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ ఆందోళన వ్యక్తం చేసింది.