అంతర్జాతీయం

అగ్ని-5కి పోటీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, మార్చి 17: భారత్ శక్తివంతమైన అణ్వస్త్రాలను మోసుకెళ్లగలిగే అగ్ని-5 క్షిపణిని అభివృద్ధి చేస్తుండటంతో అందుకు ప్రతిగా చైనా తనకు ఎల్లవేళలా మిత్రదేశమైన పాకిస్తాన్‌తో రక్షణ సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పాకిస్తాన్‌తో కలిసి బాలిస్టిక్ క్షిపణులను తయారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయిదు వేల కిలో మీటర్లకు పైగా దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలిగే శక్తి గల అగ్ని-5 క్షిపణి మొత్తం చైనాలోని ఏ ప్రాంతాన్నయినా చేరుకోగలుగుతుంది. పాకిస్తాన్‌తో కలిసి బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులను తయారు చేయడానికి చైనా ప్రణాళిక రూపొందిస్తోందని చైనా అధికార మీడియాలో వచ్చిన వార్తలపై స్పందించడానికి ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరాకరించింది. అయితే దక్షిణాసియాలో ‘వ్యూహాత్మక సమతుల్యత’కు చైనా నిలబడుతుందని పేర్కొంది. ‘పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చైనా సందర్శనకు సంబంధించిన సమాచారాన్ని పాక్ సైన్యం వెల్లడించింది. పాక్ ఆర్మీ చీఫ్‌కు, చైనా ఆర్మీ చీఫ్‌కు మధ్య జరిగిన సమావేశాల గురించి తెలిపింది’ అని చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ ఇక్కడ విలేఖరుల సమావేశంలో చెప్పారు. పాకిస్తాన్ విడుదల చేసిన వార్తల్లో ఇరు దేశాల మధ్య బాలిస్టిక్ క్షిపణుల ఒప్పందం గురించి తమకు ఎక్కడా కనబడలేదని ఆమె చైనా అధికార పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’లో ప్రచురితమైన ఒక వార్తాకథనంపై అడిగిన ప్రశ్నకు బదులుగా చెప్పారు.