అంతర్జాతీయం

706 క్యారెట్ల భారీ వజ్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రీటౌన్, మార్చి 17: పశ్చిమ ఆఫ్రికాలోని సియారా లియోన్ దేశంలో 706 క్యారెట్ల భారీ వజ్రం లభించింది. వజ్రాలు అధికంగా లభించే కోనో ప్రాంతంలో క్రిస్టియన్ పాస్టర్‌గా పని చేస్తున్న ఇమానుయేల్ మోమోహ్ అనే అతనికి ఈ వజ్రం లభించింది. ఇమానుయేల్ ఈ వజ్రాన్ని దేశాధ్యక్షుడు డాక్టర్ ఎర్నెస్ట్ బాయ్ కొరోమోనోకు బహూకరించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియజేసింది. అత్యంత విలువైన ఈ వజ్రాన్ని దేశం వెలుపలకు అక్రమంగా తరలించకుండా ప్రభుత్వానికి అందజేసినందుకు ఇమానుయేల్‌కు అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలియజేస్తూ, దేశ ప్రయోజనాల కోసం ఈ వజ్రాన్ని పారదర్శకంగా వేలం వేయనున్నట్లు చెప్పారని ఆ ప్రకటన తెలిపింది. సియారా లియోన్‌లో వజ్రాల అక్రమ రవాణా ఎక్కువ. కాగా, ప్రపంచంలోనే అత్యంత విలువైన పది వజ్రాల్లో ఇదొకటని, ఓ చిన్న గనిలో ఇలాంటి భారీ వజ్రం దొరకడం చాలా అరుదని వజ్రాల ఎగుమతిదారుడు పౌల్ జిమ్నిస్కీ అంటున్నారు. ఈ వజ్రంలో లోపాలను, రంగును ప్రొఫెషనల్‌గా అంచనా వేసిన తర్వాత మాత్రమే దీని విలువను నిర్ణయించడం సాధ్యం అవుతుంది. కాగా, 2015లో బోట్స్‌వానాలోని ఓ గనిలో 1,111 క్యారెట్ల భారీ వజ్రం లభించింది. ఈ శతాబ్ద కాలంలో లభించిన అతి పెద్ద వజ్రం ఇదే. అయితే 1905లో దక్షిణాఫ్రికాలో కనుగొన్న 3,106 క్యారెట్ల కల్లినన్ డైమండే ఇప్పటివరకు కనుగొన్న వజ్రాలన్నిటిలోకి అతి పెద్దది.

చిత్రం.. 706 క్యారెట్ల భారీ వజ్రం