అంతర్జాతీయం

రైలును గెలిచిన రైతు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లూధియానా, మార్చి 18: రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా భూమిని కోల్పోయి నష్టపరిహారం కోసం కోర్టును ఆశ్రయించిన సంపూరన్ సింగ్ అనే లూధియానా రైతు న్యాయ పోరాటంలో చివరికి అపూర్వ విజయం సాధించాడు. లూధియానా-చండీగఢ్ మధ్య రైల్వే లైన్‌కు సంబంధించిన ఈ వ్యవహారం ఈ వారం అనూహ్య మలుపు తిరగడంతో ఆ రైతు ఏకంగా ఒక ఎక్స్‌ప్రెస్ రైలునే నష్టపరిహారంగా గెలుచుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. కొత్త రైలు మార్గాల నిర్మాణం కోసం పంజాబ్‌లో జరిపిన భూసేకరణలో కొంత భూమిని కోల్పోయిన తనకు రైల్వే శాఖ సరైన పరిహారం చెల్లించలేదని 2015 నుంచి న్యాయ పోరాటం సాగిస్తున్న సంపూరన్ సింగ్ ఆ కేసులో విజయం సాధించాడు. అయినప్పటికీ తగిన నష్టపరిహారం చెల్లించేదుకు రైల్వే శాఖ నిరాకరించడంతో ఈ ఏడాది జనవరిలో ఆయన మరో పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో సంపూరన్ సింగ్‌కు చెల్లించాల్సిన కోటి రూపాయల బకాయికి బదులుగా ఒక ఎక్స్‌ప్రెస్ రైలును పరిహారంగా ఇవ్వాలని పంజాబ్‌లోని కోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా ఈ రైలు ప్రయాణించే నగరమైన లూధియానాలో స్టేషన్ మాస్టర్ కార్యాలయ యాజమాన్య హక్కులను కూడా సంపూరన్ సింగ్‌కే మంజూరు చేస్తున్నట్లు న్యాయమూర్తి జస్పాల్ వర్మ స్పష్టం చేశారు. ఈ విషయాలను ఆయన తరఫు న్యాయవాది రాకేష్ గాంధీ వెల్లడించారు. ‘పెండింగ్ బకాయలను చెల్లించాల్సిందిగా రైల్వే శాఖను ఒప్పించేందుకు మేము ఎన్నో ప్రయత్నాలు చేశాం. దీంతో బకాయిల రికవరీ కోసం రైల్వే శాఖకు చెందిన ఆస్తులను గుర్తించాల్సిందిగా న్యాయస్థానం మాకు సూచించింది’ అని ఆయన తెలిపారు. బుధవారం ఈ కేసు విచారణ పూర్తయిన తర్వాత కోర్టు ఉత్తర్వును చేతబట్టుకుని లూధియానా రైల్వే స్టేషన్‌కు వెళ్లిన సంపూరన్ సింగ్, ఆయన తరఫు న్యాయవాది అక్కడ కొద్దిసేపు వేచి ఉండి సంబంధిత రైలు డ్రైవర్‌కు ఆ ఉత్తర్వు ప్రతిని అందజేశారు. ఆ తర్వాత ఆ రైలులోని వేలాది మంది ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగించరాదని భావించి ఆ రైలును గమ్యస్థానానికి చేర్చేందుకు డ్రైవర్‌కు అనుమతి ఇచ్చినట్లు సంపూరన్ సింగ్ తెలిపాడు.
ఇదిలావుంటే, ఈ కేసుకు సంబంధించి శనివారం మరోసారి విచారణ జరుగనుంది. దీంతో అప్పటివరకూ ఈ రైలును తమ ఆధీనంలోనే ఉంచేలా కోర్టు నుంచి రైల్వే అధికారులు తాత్కాలిక ఉత్తర్వు తెచ్చుకున్నారు. రైల్వే అధికారులు శనివారంలోగా డబ్బు చెల్లించకపోతే ఈ రైలును వేలం వేసేందుకు న్యాయస్థానం అనుమతి ఇవ్వవచ్చని రాకేష్ గాంధీ తెలిపారు. 20 బోగీలు కలిగిన ఈ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రస్తుతం న్యూఢిల్లీ-అమృత్‌సర్ మధ్య ప్రతి రోజూ నడుపుతున్నారు.