అంతర్జాతీయం

హ్యూస్టన్ పిడబ్ల్యుఇ చీఫ్‌గా హైదరాబాద్ వాసి కరుణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హ్యూస్టన్, మార్చి 18: అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో ప్రజాపనులు, ఇంజనీరింగ్ వ్యవహారాల విభాగానికి ఇండో-అమెరికన్ ఇంజనీర్ కరుణ్ శ్రీరామ అధిపతిగా వ్యవహరించనున్నారు. హ్యూస్టన్ నగర మేయర్ సిల్వెస్టర్ టర్నర్ ఆయనను ఈ పదవిలో నియమించారు. విరివిగా రాజకీయ విరాళాలు ఇచ్చే దాతగా పేరు పొందిన కరుణ్ శ్రీరామ (53) పదవీ విరమణ పొందుతున్న హ్యూస్టన్ నగర పిడబ్ల్యుఇ చీఫ్ డేల్ రుడిక్ నుంచి ఈ బాధ్యతలను స్వీకరించనున్నారు. హైదరాబాద్‌కు చెందిన కరుణ్ శ్రీరామను ఈ పదవిలో నియమించడాన్ని హ్యూస్టన్ నగర పాలక మండలి ఆమోదిస్తే వచ్చే నెల 3వ తేదీ నుంచి ఆయన బాధ్యతలను చేపట్టనున్నారు. దీంతో హ్యూస్టన్‌లో ప్రభుత్వ విభాగానికి అధిపతిగా నియమితులైన తొలి ఆసియా ఖండ వాసిగా ఆయన చరిత్రకెక్కనున్నారు.