అంతర్జాతీయం

ట్రంప్‌కు భద్రత కరువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 18: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అధ్యక్ష భవనమైన వైట్ హౌస్‌లో రక్షణ లేదా? అవుననే అంటున్నారు మాజీ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ డాన్ బొంగినో. ట్రంప్ వైట్‌హౌస్‌లో సురక్షితంగా లేరని, వైట్‌హౌస్‌పై ఉగ్రవాద దాడి జరిగితే, ఆ దాడి నుంచి ఆయనను సీక్రెట్ సర్వీస్ కాపాడలేదని ఇంతకుముందు అధ్యక్షుడు బరాక్ ఒబామా, జార్జి డబ్ల్యు బుష్‌కు రక్షణ బాధ్యతలు నిర్వహించిన డాన్ పేర్కొన్నారు. ఇటీవల వైట్ హౌస్ ప్రహరీ కంచె దూకి లోనికి ప్రవేశించడంతోపాటు 15 నిమిషాలకు పైగా వైట్ హౌస్ చుట్టూ తిరిగిన ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఓ వ్యక్తి లోనికి ప్రవేశించినట్లు హెచ్చరికలు (అలారమ్స్) స్పష్టంగా చూపించాయని, పైగా అతడిని కొంతమంది అధికారులు కూడా చూశారని, అయినా వారు దాని గురించి ఏమీ ఆలోచించలేదని, ఇదో పెద్ద విశేషమని డాన్ బొంగినోను ఉటంకిస్తూ ‘్ఫక్స్ న్యూస్’ తెలిపింది. ‘వ్యక్తి చొరబాటు సంఘటన ట్రంప్‌కు వైట్ హౌస్‌లో భద్రత లేదనే విషయాన్ని వెల్లడించింది. సీక్రెట్ సర్వీస్ తగినంత పటిష్ఠంగా లేదు. అధ్యక్షుడిని సురక్షితంగా ఉంచడానికి అవసరమైనంత సిబ్బంది సీక్రెట్ సర్వీస్‌కు లేరు’ అని డాన్ తెలిపారు.
‘ఒబామా కేర్’ స్థానంలో కొత్త పథకం
ఒబామా హయాంలో ప్రవేశపెట్టిన ఆరోగ్య సంరక్షణ పథకం ‘ఒబామా కేర్’పై ట్రంప్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఒబామా కేర్ వినాశకరమైందని, అది ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. ఒబామా కేర్ ఆరోగ్య సంరక్షణ పథకం కింద బీమా ప్రీమియం బాగా పెరిగిపోవడంతో దాన్ని రద్దు చేసి, దాని స్థానంలో మరో పథకాన్ని ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్న ట్రంప్.. జర్మన్ చాన్సలర్ ఏంజిలా మెర్కెల్‌తో కలిసి ఇక్కడ ఏర్పాటు చేసిన సంయుక్త విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒబామా కేర్ ఘోరంగా విఫలమయిందని, అందువల్ల అతి త్వరలోనే దాన్ని రద్దు చేస్తామని ఆయన అన్నారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే ఒబామా కేర్‌ను రద్దు చేస్తాననేది ట్రంప్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రధాన హామీలలో ఒకటి. అధికారంలోకి వచ్చిన ఆయన దాన్ని రద్దు చేయడానికి చర్యలు మొదలుపెట్టారు.
ఒబామాపై మళ్లీ ట్రంప్ ఆరోపణలు
ఒబామా తన ఫోన్లను ట్యాప్ చేయడానికి ఆదేశాలు జారీ చేశారని ఆయన పునరుద్ఘాటించారు. ఇదివరకు కూడా చేసిన ఈ ఆరోపణలను ఉపసంహరించుకోవాలని, క్షమాపణలు చెప్పాలని ఇటు రిపబ్లికన్లు, అటు డెమొక్రాట్ల నుంచి పెరుగుతున్న డిమాండ్లను ట్రంప్ తోసిపుచ్చారు. కొనే్నళ్ల క్రితం మెర్కెల్ ఫోన్‌ను అమెరికా జాతీయ భద్రతా సంస్థ ట్యాప్ చేసినట్లు వచ్చిన ఆరోపణలను ఒక విలేఖరి ప్రస్తావించగా, వైర్‌ట్యాపింగ్‌కు సంబంధించి గత పాలనా యంత్రాంగం అలా చేసి ఉంటుందని తాను భావిస్తున్నానని ట్రంప్ బుదులిచ్చారు.