అంతర్జాతీయం

ఎందుకు ఆపారో చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోనోలులు, మార్చి 19: ఆరు ముస్లిం దేశాలకు చెందిన ప్రజలు అమెరికాలోకి రాకుండా నిషేధిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా జారీ చేసిన సవరించిన ప్రయాణ నిషేధపుటుత్తర్వులను నిలిపివేస్తూ జారీ చేసిన ఆదేశాలపై వివరణ ఇవ్వాలని హవాయి డిస్ట్రిక్ట్ జడ్జిని అమెరికా ప్రభుత్వం కోరింది. ఈ ఉత్తర్వులు ట్రంప్ జారీ చేసిన ప్రయాణ నిషేధపుటుత్తర్వులోని అమెరికాలోకి ప్రవేశించే శరణార్థుల సంఖ్యపై అంతర్జాతీయంగా విధించిన పరిమితికి వర్తించదని వాదిస్తూ ప్రభుత్వం ఆ జడ్జిని వివరణ కోరింది. ట్రంప్ తాజాగా జారీ చేసిన ప్రయాణ నిషేధ ఉత్తర్వు అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ జారీ చేసిన ఉత్తర్వు ఆరు ముస్లిం దేశాలనుంచి అమెరికాలోకి వచ్చే వారిపై ట్రంప్ విధించిన నిషేధానికి మాత్రమే వర్తిస్తుందని, అందువల్ల దీనిపై వివరణ ఇవ్వాలని అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి డెరిక్ వాట్సన్‌ను శనివారం దాఖలు చేసిన పిటిషన్‌లో న్యాయమంత్రిత్వ శాఖ కోరింది. ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను నిలిపివేయాలని కోరుతూ హవాయి ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై డెరిక్ వాట్సన్ ఈ ఉత్తర్వు ముస్లింలకు వ్యతిరేకంగా తీసుకున్న చర్య అని స్పష్టంగా కనిపిస్తోందని, రాష్ట్ర ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని పేర్కొంటూ, దాని అమలును నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే హవాయి ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ అమెరికాలోకి శరణార్థుల రాకను 120 రోజుల పాటు నిషేధించడంతో పాటుగా ఈ ఆర్థిక సంవత్సరం దేశంలోకి వచ్చే శరణార్థుల సంఖ్యను 50 వేలకు పరిమితం చేస్తున్న ట్రంప్ ఉత్తర్వులోని మరో సెక్షన్‌ను సవాలు చేయడంలో విఫలమైందని న్యాయ శాఖ అంటూ, ఈ పరిమితి మతం ఆధారంగా ఎలాంటి వివక్షా చూపడం లేదని కూడా వాదించింది.