అంతర్జాతీయం

రాక్ ఎన్‌రోల్ స్టార్ చక్ బెర్రీ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెయింట్ లూయిస్, మార్చి 19: అమెరికా పాపులర్ సంగీ తం అయిన రాక్ ఎన్ రోల్‌కు తన పాటలు, గిటార్ ద్వారా సరికొత్త నిర్వచనం చెప్పిన, ఎంతో మందికి మార్గదర్శకుడైన చక్ బెర్రీ శనివారం మి స్సోరిలోని తన ఇంట్లో కన్నుమూశారు. ఆయన వయసు 90 ఏళ్లు. బెర్రీ ఇంటి పనిమనిషి తమకు ఫోన్ చేశారని, తాము వెళ్లే సరికే బెర్రీ అచేతనంగా పడి ఉన్నారని, స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంటా 26 నిమిఃలకు ఆయన చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారని సెయింట్ చార్లెస్ కౌంటీ పోలీసులు తెలిపారు. ఆయన పూర్తి పేరు చార్లెస్ ఎడ్వర్డ్ ఆండర్సన్ బెర్రీ, 1950 దశకంలో రాక్ ఎన్ రోల్ సంగీతం శైశవ దశలో ఉన్న సమయంలో ఈ రంగంలోకి అడుగుపెట్టిన బెర్రీ దాని తొలి స్టార్ గిటారిస్టుగా, పాటల రచయితగా ఎదిగారు. ఆ తర్వాత రాక్ ఎన్ రోల్‌లో పాపులర్ అయిన శే్వతజాతీయులంతా కూడా ఈ నల్లజాతీయుడినే అనుకరించారంటే అతిశయోక్తి కాదు. బీటిల్స్, రోలింగ్ స్టోన్స్, చివరికి రాక్ ఎన్ రోల్ కింగ్‌గా ప్రసిద్ధుడైన ఎల్విస్ ప్రెస్లీ ప్రదర్శనల్లో సైతం బెర్రీ పాటలు తప్పకుండా ఉండేవి. దాదాపు రాక్‌ఎన్‌రోల్ పెర్ఫార్మర్లుగా ఎదగాలనుకుని గిటార్ చేతపట్టే ప్రతి ఒక్క చిన్నారిపైనా బెర్రీ ప్రభావం తప్పకుండా ఉండేది. బాబ్ డైలాన్ ఆయనను ‘షేక్‌స్పియర్ ఆఫ్ రాక్ ఎన్‌రోల్’గా అభివర్ణించారు.