అంతర్జాతీయం

పెరూలో ప్రకృతి విలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లీమా, మార్చి 19: భారీ వర్షాలు, వరదలతో పెరూ అల్లకల్లోలంగా మారింది. రెండు దశాబ్దాల్లో ఇలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కోలేదని అధికారులు స్పష్టం చేశారు. దేశంలో సగం ప్రాంతం ప్రకృతి విలయం బారిన పడింది. ఎక్కడికక్కడ కుంభపోత వర్షం, వరదలు, మట్టిపెళ్లలు విరగిపడడం వంటి దృశ్యాలే కనిపించాయి. ఇళ్లు, కార్యాలయాలు, ఆసుపత్రులు, వాణిజ్య సముదాయాలను వరద ముంచెత్తింది. దేశ వ్యాప్తంగా 72 మంది చనిపోయారని ప్రభుత్వం ప్రకటించింది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన తుపాను ప్రభావం వల్ల మరో రెండు వారాలు వరద ఉద్ధృతి కొనసాగే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రధాని ఫెర్నాండో జవాలా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పెరూ పసిఫిక్ కోస్తా ప్రాంతంలోని నగరాల్లో డ్రెయిన్లు పొంగి ప్రవహిస్తున్నాయి. ముంపుప్రాంతాల్లో డెంగ్యూ వంటి అంటు రోగాలు ప్రబలే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. 811 నగరాల్లో ఎమర్జన్సీ ప్రకటించిన ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దించింది. నిత్యావసరాల ధరలు నింగినంటాయి.

చిత్రాలు.. ప్రకృతి విలయానికి అతలాకుతలమైన పెరూ నగరం