అంతర్జాతీయం

కొడుకే హంతకుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 20: కన్నతల్లిని పాశవికంగా హత్యచేసిన 17 ఏళ్ల ఇండో అమెరికన్‌ను ఉత్తర కరోలినా పోలీసులు అరెస్టు చేశారు. 2015 డిసెంబర్ 17న జరిగిన ఈ సంఘటన తీవ్ర సంచలనం రేపింది. ముఖ్యంగా అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం నళినీ తెల్లప్రోలు (51) డ్యూక్ మెడికల్ సెంటర్‌లో పనిచేస్తుండేవారు. ఆమెకు ఓ కుమారుడు ఉన్నారు. ఆర్నవ్ ఉప్పలపాటి ఓ పాఠశాలలో చదువుకుంటూ ఉండేవాడు. ఏడాదిన్నర క్రితం ఆర్నన్ సొంత తల్లిని పాశవికంగా చంపేశాడు. మృతదేహాన్ని ఓ ప్లాస్టిక్ కవర్లో వేసి ఇంటి ఆవరణలోని గ్యారేజ్‌లో ఉంచాడు. కాళ్లు కారు వెనక సీట్లో ఉంచాడు. ఏమీ ఎరుగనట్టు తన తల్లి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారించగా, దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగుచూశాయి. హత్యకు ముందు ఆమెను తీవ్రంగా కొట్టినట్టు, ఊపిరాడకుండా గొంతి నులిపినట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. అయితే హత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. అప్‌చర్చి ఫామ్స్ డివిజన్‌లో ఉన్న రెండంతస్తుల భవనంలోకి బయట వ్యక్తులు ఎవరూ ప్రవేశించడానికి వీలులేదు. దీంతో కేసు మిస్టరీగానే ఉండిపోయింది. ఆర్నవ్ ఉప్పలపాటి పొంతనలేని సమాధానాలు, అతడి ప్రవర్తనపై అనుమానాలు రావడంతో పోలీసులు లోతుకంటూ దర్యాప్తు జరిపి అతడే హంతకుడిగా నిర్ధారించుకున్నారు. ఎట్టకేలకు హంతకుడైన కొడుకుని ఉత్తర కరోలినా పోలీసులు అరెస్టు చేశారు. ఇది అత్యంత అరుదైన కేసని వాకే కంట్రీ డిస్ట్రిక్ అటార్నీ లోరిన్ ఫ్రీమేన్ స్పష్టం చేశారు. కన్నకొడుకే ఇంత దుర్మార్గానికి ఒడిగట్టాల్సి వచ్చిందో అర్థంకావడం లేదని నళినీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ పద్మ తుమ్మల, విజయ్ జవ్వాది అన్నారు. ఆర్నవ్‌పై నేరం రుజవైతే యావజ్జీవ జైలు తప్పదు. పెరోల్‌కు కూడా ఆస్కారం ఉండదని పోలీసులు వెల్లడించారు.