అంతర్జాతీయం

ద్వైపాక్షిక బంధానికి విఘాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, మార్చి 20: తన అభ్యంతరాలను ఖాతరు చేయని పక్షంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు విఘాతం కలుగుతుందని భారత్‌ను చైనా హెచ్చరించింది. బిహార్‌లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ బౌద్ధమత సదస్సుకు టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాను ఆహ్వానించిన నేపథ్యంలో చైనా ఈ హెచ్చరిక చేసింది. ‘్భరత ప్రభుత్వం బౌద్ధమతంపై నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సుకు దలైలామాను ఆహ్వానించడంపై ఇటీవల చైనా చేసిన విజ్ఞప్తిని భారత్ ఏమాత్రం పట్టించుకోలేదు. పూర్తిగా నిర్లక్ష్యం వహించింది’ అని చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ సోమవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో అన్నారు. భారత్ చర్యపట్ల చైనా తీవ్ర అసంతృప్తితో ఉందని ఆమె పేర్కొన్నారు. దలై గ్రూపు చైనా వ్యతిరేక వేర్పాటువాద స్వభావం గలదనే విషయం స్పష్టమని, టిబెట్, దాని సంబంధిత అంశాలపై భారత్ తన హామీలకు కట్టుబడి ఉండాలని, చైనా అభిప్రాయాన్ని గౌరవించాలని, చైనా-్భరత్ సంబంధాలు మరింత దిగజారకుండా చూడాలని ఆమె హితవు పలికారు. బిహార్‌లోని నలందా జిల్లా రాజ్‌గిరిలో మార్చి 17న అంతర్జాతీయ బౌద్ధమత సదస్సును 81 ఏళ్ల దలైలామా ప్రారంభించారు. ‘21వ శతాబ్దంలో బౌద్ధమతం’ అనే అంశంపై నిర్వహించిన ఈ సదస్సుకు వివిధ దేశాల నుంచి బౌద్ధ భిక్షువులు, స్కాలర్లు తరలివచ్చారు. భారత ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్‌ను దలైలామా సందర్శించడానికి అనుమతించడంపై కూడా చైనా ఈ నెల మొదట్లో అభ్యంతరం వ్యక్తం చేసింది.