అంతర్జాతీయం

అనివార్యమైతే.. పాక్‌పై ముందస్తుగా భారత్ అణు దాడి!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 21:పాకిస్తాన్ తమపై అణు దాటికి పాల్పడే అవకాశం ఉందన్న స్పష్టమైన సంకేతాలు అందే పక్షంలో భారత్ ముందస్తు ఆ తరహా దాడులకు దిగే అవకాశం ఉంటుందని అమెరికాకు చెందిన ఓ ప్రముఖ అణు వ్యూహకర్త స్పష్టం చేశారు. తమంతట తాముగా దాడులకు దిగబోమన్న విధానానికి ఇలాంటి అనివార్య పరిస్థితుల్లో భారత్ స్వస్తి పలికే అవకాశం ఎంతైనా ఉందని మసాచుసెట్స్ టెక్నాలజీ సంస్థకు చెందిన విపిన్ నారంగ్ తెలిపారు.అయితే భారత్ జరిపే దాడులు పాక్ అణు కేంద్రాలనే లక్ష్యంగా చేసుకుని సాగేందుకూ ఎంతైనా అవకాశం ఉందని ఆయన విశే్లషించారు. మామూలుగా జరిగే ప్రతీకార దాడుల మాదిగా పాక్‌లోని పట్టణ కేంద్రాలు, సంప్రదాయక లక్ష్యాలపై భారత్ గురి పెట్టే అవకాశం లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్‌కు ముందుగా దాడిచేసే అవకాశాన్ని భారత్ ఇవ్వక పోవచ్చునన్నారు. అణు కేంద్రాలనే లక్ష్యంగా చేసుకుని భారత్ దాడి చేసేందుకు వీలుంటుందని చెప్పడానికి కారణం పొరుగు దేశం అణు శక్తిని నిర్వీర్యం చేయడమేనని..ఈ తరహా దాడులు తమ కేంద్రాలపై జరుగకుండా నిరోధించడమేనని విపిన్ తెలిపారు.