అంతర్జాతీయం

విమానాల్లో ల్యాప్‌టాప్‌లు నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 21: ఎనిమిది ముస్లిం దేశాలలోని పది విమానాశ్రయాల నుంచి అమెరికా వచ్చే ప్రయాణికులపై ట్రంప్ ప్రభుత్వం సరికొత్త నిబంధనలు విధించింది. రహస్యంగా దాచుకున్న ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా 9/11 తరహా దాడులకు ఉగ్రవాదులు కుట్రపన్నారంటూ నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారంతో కఠినమైన రక్షణ చర్యలు చేపట్టినట్లు వైట్‌హౌస్ అధికారులు ప్రకటించారు. క్యాబిన్ బ్యాగేజిలో సాధారణంగా విమానంలోకి తీసుకువెళ్లే ల్యాప్‌టాప్‌లు, ఐపాడ్, కిండ్లె, డివిడి ప్లేయర్, కెమెరా, ఈ-రీడర్, గేమింగ్ డివైస్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను నిర్దేశిత ఎనిమిది దేశాల ప్రజలు తీసుకురావటానికి వీల్లేదని ఆంక్షలు విధించారు. ఎనిమిది దేశాలకు చెందిన పది విమానాశ్రయాల మీదుగా ప్రయాణించే వారికి ఇది వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. ఈజిప్ట్‌లోని కైరో, దుబాయ్, అబుధాబీ, యుఏఈ, టర్కీలోని ఇస్తాంబుల్, దోహా, ఖతార్, జోర్డాన్‌లోని అమ్మన్, కువైట్ సిటీ, మోరాకోలోని కాసాబ్లాంకా, సౌదీ అరేబియాలోని జెద్దా, రియాద్ విమానాశ్రయాలను ఈ నిబంధనల పరిధిలోకి తీసుకువచ్చారు. ఈ నిబంధనల వల్ల ఈజిప్ట్ ఎయిర్, ఎమిరేట్స్ ఎయిర్‌లైన్, ఖతార్ ఎయిర్‌వేస్, రాయల్ ఎయిర్ మొరాకో, రాయల్ జోర్డానియన్ ఎయిర్‌లైన్స్, సౌదీ అరేబియన్ ఎయిర్‌లైన్స్, టర్కిష్ ఎయిర్‌లైన్‌లపై తక్షణ ప్రభావం పడనుంది. పోర్టబుల్ ఎలక్ట్రానిక్ పరికరాలద్వారా పేలుడు పదార్థాలను స్మగ్లింగ్ చేసే అవకాశాలున్నాయని హోంలాండ్ సెక్యూరిటీ విభాగం సెక్రటరీ జాన్ కెల్లీ తెలిపారు. ప్రింటర్లు, స్కానర్లు వంటి అన్ని నిషేధిత పరికరాలను కార్గోద్వారా తెచ్చుకోవచ్చని పేర్కొంది. అయితే వైద్య సంబంధిత పరికరాలకు అనుమతి ఉందని రాయల్ జోర్డానియన్ ఎయిర్‌లైన్స్ తన ప్రయాణికులకు సూచించింది.