అంతర్జాతీయం

వీసాలపై తనిఖీ పెంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 24: వీసాలు జారీ చేసేందుకు అనుసరించే తనిఖీ ప్రక్రియను మరింత కఠినతరం చేయాలని, అదనపుస్క్రూటినీ అవసరమైన గ్రూపులను గుర్తించాలని ట్రంప్ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన దౌత్య కార్యాలయాలను ఆదేశించింది. టూరిస్టు, బిజినెస్ వీసాలతో పాటుగా అమెరికా వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారినందరినీ గత 15 ఏళ్లుగా ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు, నివాసం ఉంటున్నారులాంటి వివరాలతో పాటుగా గత అయిదేళ్లుగా వారు ఉపయోగించిన ఫోన్ నంబర్ల వివరాలను కూడా సమర్పించాలని అడగాలని అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్‌సన్ దౌత్య కార్యాలయాలకు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 6న ఆరు ముస్లిం దేశాలకు చెందిన వారు అమెరికాలోకి ప్రవేశించకుండా ఆంక్షలు విధిస్తూ సవరించిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుపై అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేసిన తర్వాత ఈ కేబుల్‌ను పంపించారు. హింసాత్మక, నేరపూరిత, లేదా ఉగ్రవాద చర్యలను సమర్థించే లేదా అలాంటి చర్యలకు పాల్పడే విదేశీయులు అమెరికాలోకి ప్రవేశించకుండా చూడడం కోసం, అలాగే అమెరికాలోకి రావడానికి అనుమతించిన వారిని నిశిత పరిశీలన చేయడం కోసం ఈ అదనపు ప్రోటోకాల్స్‌ను ప్రవేశపెట్టడం జరిగిందని ఈ నెల 15న జారీ అయిన ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విదేశీయులకు వీసాలు జారీ చేయడం కోసం నిశిత పరిశీలన జరపడానికి కొన్ని కొలమానాలను కూడా తక్షణం రూపొందించుకోవాలని కూడా దౌత్యాధికారులను ఆ ఉత్తర్వులో కోరారు. ఈ చర్య వల్ల భారతీయులపై ఏదయినా ప్రభావం ఉంటుందా అనే విషయం వెంటనే తెలియరాలేదు. అయితే ఈ చర్యల కారణంగా వీసాలు జారీ చేసే ప్రక్రియ జాప్యమయ్యే అవకాశముందని, దరఖాస్తులు పేరుకుపోవచ్చని అమెరికా ఇమిగ్రేషన్ లాయర్ల అసోసియేషన్ డైరెక్టర్ గ్రెగ్ చాన్ అంటున్నారు.